Asianet News TeluguAsianet News Telugu

రాజధాని రచ్చ: కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో పవన్ భేటీ

మూడు రాజధానులను తేల్చేందుకు  బీజేపీ అగ్రనేతలతో సమావేశమయ్యేందుకు బుధవారం నాడు పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీకి వచ్చారు. 

Janasena chief Pawan kalyan meets union minister in new delhi
Author
New Delhi, First Published Jan 22, 2020, 4:38 PM IST

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బుధవారం నాడు మధ్యాహ్నం సమావేశమయ్యారు. బుధవారం నాడు అమరావతి నుండి హైద్రాబాద్‌కు చేరుకొన్నారు.పవన్ కళ్యాణ్. శంషాబాద్ విమానాశ్రయం నుండి పవన్ కళ్యాణ్ ‌ బుధవారం నాడు ఉదయం ఢిల్లీకి వెళ్లారు.

also read: ఏపీ శాసనమండలి: అంగుళం భూమి లేదు, చేతులు జోడించి వేడుకొన్న లోకేష్

Also read:మొబైల్ చూసి నారా లోకేష్ లెక్కలు: తప్పు పట్టిన బొత్స, బుగ్గన అభ్యంతరం

న్యూఢిల్లీకి చేరుకొన్న తర్వాత పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని పవన్ కళ్యాణ్ మంగళవారం నాడు రాజధాని రైతులకు హామీ ఇచ్చారు.

Also read:ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

ఏపీకి మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులతో పాటు ఏపీ ఆర్ధిక పరిస్థితులు, అభివృద్ధి తదితర అంశాలపై బీజేపీ, జనసేన నేతలు చర్చించారు. సుమారు గంటకు పైగా బీజేపీ, జనసేన నేతలు సమావేశమయ్యారు.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

Also read:మండలిలో జగన్‌కు షాక్: ఆ రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపాలని టీడీపీ నోటీసు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కూడ  పవన్ కళ్యాణ్ భేటీ అయ్యే అవకాశం ఉంది.  బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతో కలిసి పవన్ కళ్యాణ్ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

Also read:రూల్ 71: బుగ్గన ఆ ప్రతిపాదన ఎందుకు చేశారు

Also read:మండలిలో టీడీపీ పట్టు: రూల్ 71 అంటే ఏమిటీ?

also read:ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ: శాసనమండలి రద్దే ఎజెండా?

Also read:మండలిలో వైఎస్ జగన్ కు షాక్: ఏం చేద్దాం, ప్రత్యామ్నాయాలు ఇవీ

మూడు రాజధానులను వ్యతిరేకించే విషయంలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై కూడ బీజేపీ, జనసేన పార్టీల మధ్య బుధవారం నాడు చర్చ జరిగే అవకాశం ఉంది.  ఈ  రెండు పార్టీల సమావేశం తర్వాత  భవిష్యత్తు కార్యాచరణను  ఈ రెండు పార్టీల నేతలు  ప్రకటించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios