ఏపీ అసెంబ్లీ: టీడీపీ సభ్యుల తీరుపై ఎథిక్స్ కమిటీకి స్పీకర్ సిఫారసు

ఏపీ అసెంబ్లీలో  టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు. 

Tammineni sitaram orders to ethics committee on Tdp legislators in Assembly


అమరావతి:   ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరును ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం..

బుధవారం నాడు అసెంబ్లీ ప్రారంభమైన  టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. టీడీపీ సభ్యుల తీరుకు వైసీపీ ఎమ్మెల్యేలు  నినాదాలు చేశారు.స్పీకర్ పోడియంపైకి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.ఈ సమయంలో సీఎం వైఎస్ జగన్ జోక్యం చేసుకొన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో పాటు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పారు

Also read:బట్టలు విప్పేసి తిరుగుతానంటే ఏం చేయలేం: జేసీ సెటైర్లు

Also read:మూడు రాజధానులు... అందరూ గౌరవించాల్సిందే.. జేసీ దివాకర్ రెడ్డి

టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. మూడు రోజులుగా చోటు చేసుకొన్న పరిణామాలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఈ సందర్భంగా గుర్తు చేశారు.పదే పదే చెప్పినా కూడ టీడీపీ సభ్యులు వినలేదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు.

Also read:ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతకు టీడీపీ నోటీసులు: ఎవరీ పోతుల సునీత

తాను బలహీనవర్గానికి చెందిన వాడిని కావొచ్చు. కానీ, బలహీనుడిని కాదని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. ఈ విషయమై  చంద్రబాబునాయుడుకు తెలుసునని తమ్బినేని సీతారాం గుర్తు చేశారు.

ఇవాళ టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరును ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేశారు స్పీకర్  తమ్మినేని సీతారాం. ఎథిక్స్ కమిటీ త్వరగా నివేదికను ఇవ్వాలని స్పీకర్ ఆదేశించారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios