Asianet News TeluguAsianet News Telugu

హనీట్రాప్.. రేప్ కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ.80 లక్షలకు టోకరా.. యూట్యూబర్ అరెస్ట్..

వ్యాపారవేత్తను అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ. 80 లక్షలకు పైగా దోపిడీ చేసినందుకు ఢిల్లీకి చెందిన యూట్యూబర్ నమ్రా ఖదీర్‌ను అరెస్టు చేశారు.

honey trap for a businessman, extorting over Rs 80 laks YouTuber Namra Qadir arrested in Delhi
Author
First Published Dec 7, 2022, 6:57 AM IST

ఢిల్లీ : ఫేక్ రేప్ కేసులో ఇరికిస్తానని బెదిరించి ఓ వ్యక్తి నుంచి రూ. 80 లక్షలు వసూలు చేసిన ఢిల్లీకి చెందిన ఓ 22 ఏళ్ల  మహిళా యూట్యూబర్ ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మహిళ భర్త కూడా నిందితుడిగా ఉన్నాడు. అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విషయమై దినేష్ యాదవ్ అనే 21 ఏళ్ల గురుగ్రామ్ నివాసి ఆగస్టు 22న సెక్టార్ 50 పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

యూట్యూబర్ నమ్రా ఖదీర్, ఆమె భర్త బేనీవాల్ రూ.10 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు, ఖరీదైన గృహోపకరణాలను కొనుగోలు చేశారని, 21 ఏళ్ల వ్యక్తి నుండి దోపిడీ చేసిన డబ్బుతోనే ఇవి కొన్నారని పోలీసు అధికారి తెలిపారు. "వారు కొన్న గృహోపకరణాలను స్వాధీనం చేసుకున్నాం, కానీ, నగలు మాత్రం దొరకలేదు. వాటికోసం వెతుకుతున్నాం’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి చెప్పారు, 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 21 ఏళ్ల ఓ వ్యక్తి దుబాయ్‌లో పనిచేసి గురుగ్రామ్‌కు వచ్చాడు. ఆ తరువాత ఇక్కడ అడ్వర్టైజింగ్ సంస్థను ప్రారంభించాడు. అతనికి సెక్టార్ 49లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో నమ్రా ఖదీర్, ఆమె భర్త బేనీవాల్ లతో పరిచయం ఏర్పడింది. తన సంస్థ ప్రకటనల కోసం ఆమె యూట్యూబ్ ఛానెల్‌ని ఉపయోగించాలనుకున్నాడని పోలీసులు తెలిపారు. దానికోసం కొంత డబ్బు వారు అడిగితే చెల్లించాడు. ఆ తరువాత కొద్ది రోజులకు నమ్రా అతనిమీద తాను ఇష్టపడ్డట్టు.. ప్రేమిస్తున్నానని తెలిపింది. అలా వారి స్నేహం వేరే రూట్ లోకి మారింది. 

నిరుడు డిసెంబర్‌లో యూట్యూబర్, ఆమె భర్త తనను పార్టీకి తీసుకెళ్లారని, అక్కడ వారు తనకు తాగించి, ఆపై హోటల్‌కు తీసుకెళ్లారని ఫిర్యాదుదారు పోలీసులకు చెప్పారు. మరుసటి రోజు హోటల్‌లో తాను కళ్లు తెరిచే సరిచి.. యూట్యూబర్ అతన్ని డబ్బులు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టింది. లేకపోతే అత్యాచారం కేసులో ఇరికిస్తానని బెదిరించిందని.. పోలీసులు తెలిపారు.

మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో మళ్లీ ప్రవేశపెట్టండి : కేంద్రానికి ప్ర‌తిప‌క్షాల సూచ‌న

సెక్టార్ -50 పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ, “బాధితుడు బాద్షాపూర్‌ నివాసి. అతని కుటుంబం అక్కడ రూ. 1.15 కోట్లకు ఒక ప్లాట్‌ను అమ్మింది. అందులో దాదాపు సగం అతనికి వచ్చాయి. బ్లాక్ మెయిల్ వల్ల అతను డబ్బును వీళ్లకు చెల్లించాడు.. అని పోలీసులు తెలిపారు.

“అలా, ఆ యూట్యూబర్ తన భర్తతో కలిసి ఇప్పటి వరకు ఆ 21 ఏళ్ల బాధితుడి నుంచి రూ.80 లక్షల వరకు దోచుకుంది. ఇది నిరుడు డిసెంబర్‌లో ప్రారంభమైంది. ఆస్తి అమ్మకంలో అతని వాటాకు వచ్చిన డబ్బులు అయిపోయి.. తన తండ్రి బ్యాంక్ అకౌంట్ నుండి రూ. 5 లక్షలు విత్‌డ్రా చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చిందని’’ పోలీసులు తెలిపారు.

ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో అన్ని డబ్బులు ఏం చేశావని వారు నిలదీశారు. అప్పుడు దినేశ్ తాను  ఎలా బ్లాక్‌మెయిలింగ్‌కు గురయ్యింది చెప్పుకొచ్చాడు. దీంతో అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడని అన్నారు. విచారణ కోసం నిందితులైన దంపతులకు మూడుసార్లు నోటీసులు అందజేశామని పోలీసులు తెలిపారు. అయితే, ఈ జంట ఎప్పుడూ పోలీసుల దగ్గరికి రాలేదు. అంతేకాదు, గురుగ్రామ్ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. అయితే, నవంబర్ 18న వాటిని కోర్టుల తిరస్కరించింది. వీరిమీద మొదట సెక్షన్లు 34, 328, 388, 406 ల కింద కేసులు నమోదు చేయబడ్డాయి. ఆ తరువాత నవంబర్ 24 న ఇండియన్ పీనల్ కోడ్ 506 సెక్షన్ కూడా నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని షాలిమార్ బాగ్‌లోని ఓ మాల్‌లో యూట్యూబర్‌ను అరెస్టు చేసి నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీకి తరలించారు. ఆమె భర్తను కూడా అరెస్ట్ చేసేందుకు గాలిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios