బాహుబలి 3 కి ముహూర్తం ఫిక్స్..? క్లారిటీ ఇచ్చేసిన రాజమౌళి..
బాహుబలి రెండు సినిమాలు ఏ రేంజ్ లో ఆడియన్స్ ను అలరించాయో అందరికి తెలిసిందే. బాహుబలి ఇంకో పార్ట్ ఉంటే బాగుండు అనిపించేలా తెరకెక్కించారు జక్కన్న రాజమౌళి. ఇక బాహుబలి మూడో పార్ట్ వస్తే ఎలా ఉంటుంది. ఈ విషయంలో రాజమౌళి ఏమన్నాడంటే..?
తెలుగు సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి. అప్పటి వరకూ సినిమాలు ఎలా ఉన్నా.. బాహుబలి తరువాత తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి. పాన్ ఇండియా రేంజ్ లో తెలగు సినిమాకు గుర్తింపు వచ్చింది. ప్రపంచ సినిమాచూపు మనవైపు పడేలా చేసింది.
బాహుబలి సినిమాను తెలుగు ప్రజల మర్చిపోలేరు.. పాన్ ఇండియా ప్రేక్షకులు కూడా ఎప్పటికీ గుర్తుంచుకునేలా అద్భుతంగా తెరకెక్కించాడు జక్కన్న. ప్రభాస్ హీరోగా.. రాజమౌళి దర్శకంత్వంలో రూపొందిన బాహుబలి.. రానా అద్భుతమైన నటన, అనుష్క, తమన్నా గ్లామర్.. శివగామిగా రమ్య కృష్ణ పెర్ఫామెన్న్స్.. సినిమాకు ప్రాణం పోశాయి. ఆడియన్స్ లో చెరగనిముద్ర వేశాయి. ఈ సినిమా తెలుగు చలనచిత్ర రికార్డులను బద్దలు కొట్టింది బాహుబలి.
రామ్ చరణ్ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా..? ఆ హీరోయిన్ ను పిచ్చిగా ప్రేమించిన మెగా పవర్ స్టార్..
బాహుబలి రెండు సినిమాల తరువాత మూడో పార్ట్ కూడా కావాలి అంటూ ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వచ్చింది. ఈసినిమా ఉంటుంది అంటూ అప్పట్లో రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా అన్నారు. రాజమౌళికి పర్సనల్ గా ఈసినిమాపై రిక్వెస్ట్ చేసిన వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా బాహుబలి పై రాజమౌళి క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
జ్యోతికకు తలనొప్పిగా మారిన ప్రియమణి, ఇద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా..?
తాజాగా ఆయన తన సోషల్ మీడియా స్టేటస్ ద్వారా బాహుబలి త్రీకి సబంధించిన అప్ డేట్ ఇచ్చాడు రాజమౌళి. టైటిల్ టీజర్ ను కూడా రిలీజ్ చేశాడు జక్కన్న. బాహుబలి 3 ది క్రౌన్ అండ్ బ్లడ్ ..అనే ట్యాగ్ తో రీసెంట్గా ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు . త్వరలోనే ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. వచ్చేది సినిమా కాదు.. యానిమేటెడ్ సిరీస్.
టాలీవుడ్ లో రిచ్చెస్ట్ హీరో ఎవరో తెలుసా..? ఆయన ఆస్తులు అన్ని వేల కోట్లా..? వైరల్ న్యూస్..
జక్కన్న పోస్ట్ లో ఇలా ఉంది. మాహిష్మతి ప్రజలు అతడి పేరును మంత్రంలా జపిస్తున్నప్పుడు.. ఈ విశ్వంలోని ఏ శక్తి అతడు తిరిగి రావడాన్ని ఆపలేదు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ రాబోతోంది”. అని రాసుకొచ్చారు రాజమౌళి. ఇది ఓ యానిమేటెడ్ సిరీస్ లాగా రాబోతుంది అంటూ చెప్పారు . దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.
Rajamouli
బాహుబలి తరువాత ఆర్ఆర్ఆర్ తో మరో సారి తెలుగు సినిమా సత్తా చూపించాడు రాజమౌళి. ఆస్కార్ సాధించిన తెలుగు సినిమా గౌరవాన్ని కాపాడాడు. రామ్ చరణ్, ఎన్టీఆర్ లను పాన్ వరల్డ్ హరోలుగా నిలబెట్టాడు జక్కన్న. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో భారీ అడ్వెంచర్ మూవీని సెక్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు.