Asianet News TeluguAsianet News Telugu

హత్రాస్ ఘటన లో షాకింగ్.. చంపింది తల్లీ అన్నలే.. పోలీసులకు నిందితుడి లేఖ..

ఉత్తరప్రదేశ్, హథ్రాస్ కేసు షాకింగ్ మలుపు తిరిగింది. బాధితురాలిని ఆమె తల్లి, అన్నలే చంపారని నిందితుల్లో ఒకరు పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీని ప్రకారం బాధితురాలి కాల్ డాటా తీసిన పోలీసులకు నిందుతుల్లో ఒకరు బాధితురాలి కుటుంబ సభ్యలుతో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు తేలింది.

Hathras case: Victim's brother, mother killed her, claims main accused in letter to Uttar Pradesh police - bsb
Author
Hyderabad, First Published Oct 8, 2020, 10:34 AM IST

ఉత్తరప్రదేశ్, హథ్రాస్ కేసు షాకింగ్ మలుపు తిరిగింది. బాధితురాలిని ఆమె తల్లి, అన్నలే చంపారని నిందితుల్లో ఒకరు పోలీసులకు రాసిన లేఖలో పేర్కొన్నాడు. దీని ప్రకారం బాధితురాలి కాల్ డాటా తీసిన పోలీసులకు నిందుతుల్లో ఒకరు బాధితురాలి కుటుంబ సభ్యలుతో అనేక సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు తేలింది.

మృతురాలి సోదరుడు నిందితుల్లో ఒకడైన సందీప్ ఠాకూర్ తో గతేడాది అక్టోబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 104 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు పోలీసులు తెలిపారు. ఈ వివరాల ఆధారంగా బాధితురాలి సోదరుడిని ప్రత్యేక ద్యాప్తు బృందం ప్రశించింది. అయితే ఫోన్ కాల్స్ గురించి తనకేమీ తెలియదని, తమ కుటుంబంలో ఎవ్వరం మాట్లాడలేదని అతను తెలిపాడు.

హథ్రాస్ ఘటనలో నిందితులుగా పేర్కొన్న సందీప్, రాము, లవ్ కుశ్, రవిలు పోలీసులకు లేఖలు రాశారు. వీరిలో సందీప్ రాసిన లేఖలో తాము నిర్దోశులమని, ఆమెను తల్లి, అన్ననే చంపారని పేర్కొన్నాడు. అంతేకాదు తాను అత్యాచారం చేయలేదని, తనకు ముందునుండి మృతురాలు తెలుసని చెప్పారు. 

మృతురాలి తల్లి, అన్న తనను కావాలని ఈ కేసులో ఇరికిస్తున్నారని వాపోయాడు. దీంతో హథ్రాస్ కేసులో మరో కీలక మలుపు తిరిగినట్టే. సెప్టెంబర్ 14న యూపీలోని హాథ్రాస్ గ్రామంలో ఓ దళిత యువతిపై దాడి జరగ్గా తీవ్ర గాయాల పాలైన బాధితురాలు అదే నెల 29న మృతి చెందిన సంగతి తెలిసిందే. 

ఈ ఘటనలో మృతురలిపై సామూహిక అత్యాచారం జరిగిందని భాదితురాలు వాంగ్మూలం ఇచ్చింది. అయితే అటువంటిదేమీ జరగలేదని, మెడకు తగిలిన గాయం వల్లే ఆమె మరణించిందని పోలీసులు వాదిస్తున్నారు. పోలీసులు మృతదేహాన్ని హడావుడిగా దహనం చేయడం అనేక విమర్శలకు దారి తీసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios