Asianet News TeluguAsianet News Telugu

యువతిపై గ్యాంగ్ రేప్ లో.. అండమాన్ మాజీ సీఎస్ జితేంద్ర నరైన్ అరెస్ట్..

అండమాన్ నికోబార్ దీవులు మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ ను సెక్స్ ఫర్ జాబ్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. 21యేళ్ల యువతిపై గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ కావడం చర్చనీయాంశమయ్యింది. 

Former Andaman CS Jitendra Narine arrested in gang rape case
Author
First Published Nov 11, 2022, 6:49 AM IST

అండమాన్ : 21 ఏళ్ల యువతిపై సామూహిక అత్యాచారం కేసులో అండమాన్ నికోబార్ దీవులు మాజీ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నరైన్ ను పోలీసులు అరెస్టు చేశారు. నరైన్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ దరఖాస్తును స్థానిక కోర్టు తిరస్కరించడంతో.. పోలీసులు ఆయనను అరెస్టు చేసినట్లు బాధితురాలు తరఫు న్యాయవాది ఫాటిక్ చంద్రదాస్ తెలిపారు. కోర్టు తీర్పు వచ్చిన కొద్దిసేపటికే పోలీసులు ఆయన ఉంటున్న ఓ ప్రైవేటు రిసార్టుకు చేరుకొని భారీ భద్రత మధ్య అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

నరేన్  సీఎస్ గా  ఉన్న సమయంలో ఉద్యోగ వేటలో ఉన్న తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికి తన అధికారిక నివాసంలో మరో అధికారితో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు యువతి ఆరోపించింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్లో ఆగస్టులో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీనియర్ ఎస్పీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయనను చాలా సార్లు విచారించింది. ఆ తర్వాత సిట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీవ్రంగా స్పందించిన కేంద్ర హోంశాఖ.. ఢిల్లీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ చైర్మన్, ఎండీగా ఉన్న నరైన్ ను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. శనివారం పోలింగ్.. కీలక వివరాలు ఇవే

ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో నవంబర్ 8న దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలికను ముగ్గురు యువకులు కిడ్నాప్ చేశారు. ఆపై ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. ఈ మేరకు బాలిక ఫిర్యాదుతో మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

సోమవారం రాత్రి బాలిక ఇంటికి వెళ్తుండగా యువకులు ఆమెను కిడ్నాప్ చేశారు. బైక్ మీద మూడు గంటల పాటు తిప్పి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక అరుపులు విని అటు వైపుగా వెడుతున్న ఓ వ్యక్తి.. అక్కడికి రాగా.. అతడిని చూసిన నిందితులు పారిపోయారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు బాలికను గత కొద్ది రోజులుగా వెంబడిస్తున్నట్లు తెలుస్తోంది. బాలిక తొమ్మిదో తరగతి చదువుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios