Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెర.. శనివారం పోలింగ్.. కీలక వివరాలు ఇవే

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నిన్నటితో ప్రచారానికి తెరపడింది. కాంగ్రెస్, బీజేపీలతోపాటు ఆప్ కూడా క్యాంపెయిన్ చేసింది. రేపు పోలింగ్ జరుగుతున్నది. డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడి కాబోతున్నాయి.
 

poll campaign ended for himachal pradesh  assembly elections, elections to held tomorrow
Author
First Published Nov 11, 2022, 4:20 AM IST

న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం గురువారంతో ముగిసింది. శనివారం పోలింగ్ జరగనుంది. ఎన్నికకు 48 గంటల ముందు నుంచి ప్రచారంపై అమలు నిషేధం అమల్లోకి వచ్చింది. పోలింగ్ తేదీల విడుదలకు ముందు నుంచే పార్టీలు ఇక్కడ ప్రచారం మొదలు పెట్టాయి. కాంగ్రెస్ లేదా బీజేపీ అధికారంలో ఉన్న ఈ రాష్ట్రంలో ఆప్ ఇప్పుడు ఉనికి కోసం ప్రయత్నిస్తున్నది. అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేశాయి.

నవంబర్ 12వ తేదీన పోలింగ్ జరగబోతున్న రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ గట్టిగానే క్యాంపెయిన్‌లు చేపట్టాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పని తీరే తమను మళ్లీ అధికారంలోకి తెస్తుందని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నది. కాగా, అధికార పార్టీ ఇచ్చిన హామీలు గాలికి వదిలిపెట్టారని, అవే తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తున్నది. బీజేపీ వైపు పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రంలో పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలు, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ రాష్ట్రంలో క్యాంపెయిన్‌లో పాల్గొన్నారు. కాగా, కాంగ్రెస్ నుంచి ప్రియాంక గాంధీ ఈ రాష్ట్రంలో ప్రచారం చేశారు.

Also Read: హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు.. ఎలక్టోరల్ బాండ్ల ద్వారా పార్టీలకు రూ.545 కోట్ల విరాళాలు

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు 68. ఈ సీట్ల కోసం సుమారు 400 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 55.92 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని తేల్చనున్నారు. 

ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని సీట్లలో పోటీ చేస్తున్నది.

క్యాంపెయిన్ చివరి రోజున బీజేపీ నేతలు, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఒక వైపు.. కాంగ్రెస్ నేత రాజీవ్ శుక్లా మరో వైపు విలేకరుల సమావేశాలు నిర్వహించారు.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే డిసెంబర్ 8వ తేదీన ఫలితాలు వెల్లడించబోతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios