Asianet News TeluguAsianet News Telugu

మహిళా కానిస్టేబుల్ లింగ మార్పిడి.. మధ్యప్రదేశ్ హోం మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం...

మధ్యప్రదేశ్ లో లింగ మార్పిడి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలి కేసు అని రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేష్ రాజౌరా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు హోం శాఖ బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఆయన తెలిపారు.

female constable allowed to change gender to become malke in madhya pradesh, first case in state
Author
Hyderabad, First Published Dec 1, 2021, 2:23 PM IST

మధ్యప్రదేశ్ : gender change తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగేందుకు ఓ  woman constable పెట్టుకున్న అభ్యర్థనను Madhya Pradesh పోలీస్ శాఖ అనుమతి ఇచ్చింది.  మహిళా కానిస్టేబుల్ అమిత  (పేరు మార్చాం)  తన జెండర్ మార్చుకునేందుకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు అనుమతి ఇచ్చారు.

మధ్యప్రదేశ్ లో లింగ మార్పిడి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం ఇదే తొలి కేసు అని రాష్ట్ర హోం శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి రాజేష్ రాజౌరా తెలిపారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు హోం శాఖ బుధవారం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి పంపినట్లు ఆయన తెలిపారు.

మహిళా కానిస్టేబుల్కు చిన్నప్పటినుంచి  Gender identity disorder సమస్య  ఉందని, జాతీయ స్థాయి సైకియాట్రిస్టులు కూడా దీనిని ధ్రువీకరించారు అని ఆయన చెప్పారు. 2019లో Gazette of Indiaలో ఉన్న నోటిఫికేషన్ ఆధారంగా Affidavit సమర్పిస్తూ సదరు మహిళా కానిస్టేబుల్ దరఖాస్తు చేసుకుంది.

Petrol Price cut: లీటర్‌ పెట్రోల్‌ ధరను రూ. 8 తగ్గించిన ప్రభుత్వం.. వాహనదారులకు పండగే.. ఎక్కడంటే..

దీనిపై మధ్యప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి సమీక్ష అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నట్లు డిజిపి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 
Police Headquarters అనుమతి కోసం హోంశాఖ నుంచి గైడెన్స్ తీసుకుంది. డాక్టర్ రాజూరా మాట్లాడుతూ.. దేశంలో ఏ పౌరుడైన తన మతం, కులంతో సంబంధం లేకుండా తన జెండర్ ను ఎంచుకునే స్వేచ్ఛ ఉందన్నారు. ఇందులో భాగంగా లా డిపార్ట్మెంట్  ను  సంప్రదించి..  హోం శాఖ తరఫున పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు అనుమతి లభించిందన్నారు. 

మహారాష్ట్రలో తొలి కేసు..
ఐదు సంవత్సరాల క్రితం..  బీడ్ కు  చెందిన 29 ఏళ్ల మహిళా కానిస్టేబుల్  తన జెండర్ ను మార్చుకోవడానికి అనుమతి కోరింది.  దేశంలో ఇదే తొలి కేసు.  అన్ని చట్టపరమైన అడ్డంకులను తొలగించిన తర్వాత  ఆమెకు  లింగ మార్పిడి సాధ్యమైంది.  ఈ చట్టపరమైన ప్రక్రియకు  అతనికి 2,3 ఏళ్లు పట్టింది. లింగమార్పిడికి అనుమతించాలంటూ ఓ మహిళా కానిస్టేబుల్ దాఖలు చేసుకున్న అభ్యర్థనను తొలుత మహారాష్ట్ర పోలీసులు తిరస్కరించారు.

ఈ మేరకు ఔరంగాబాద్ igp రాజ్ కుమార్ వాట్కర్ ఆమెకు లేఖ రాశారు. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో ఆమె అభ్యర్థనను మహారాష్ట్ర హోంమంత్రిత్వశాఖ మన్నించింది. విదేశాల నుంచి విరాళాలు అందుకుంటున్న ప్రభుత్వేతర సంస్థలు ( ఎన్జీవోలు) పై  విచారణకు ఆదేశించిన మరుసటిరోజే మధ్యప్రదేశ్ హోంశాఖ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం.  కాగా హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా మంగళవారం మాట్లాడుతూ…  మత మార్పిడి కార్యకలాపాలకు పాల్పడుతున్న పాపులర్ ఫ్రంట్ ను ప్రభుత్వం ప్రోత్సహించాలని.. దీనిపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.  పిఎఫ్ఐ,  ఇతర ఎన్జీవోల ద్వారా విదేశీ నిధుల వినియోగం పెరిగిందన్నారు.

అంతకుముందు సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ మాట్లాడుతూ... విదేశీ నిధులు పొందుతున్న ఎన్జీవోలతో పాటు సమాజంలో  శత్రుత్వాన్ని వ్యాప్తి చేసి మత మార్పిడికి పాల్పడేవారిపై దర్యాప్తు చేయాలని పోలీసు శాఖతో పాటు స్థానిక పరిపాలన వ్యవస్థలను ఆదేశించారు.

Follow Us:
Download App:
  • android
  • ios