భారత అంతరిక్ష పరిశోధన సంస్థ( ఇస్రో) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 విజయం సాధించిందా లేదా అన్న విషయంపై సందిగ్ధదత నెలకొంది. మరికాసేపట్లో చంద్రుడిపైకి అడుగుపెడుతుందన్న సమయంలో... చంద్రయాన్ 2 నుంచి సిగ్నల్స్ రావడం ఆగిపోయాయి. దీంతో ఏం జరుగుతుందో అర్థంకాక శాస్త్రవేత్తలు తీవ్ర ఆవేదనకు గురౌతున్నారు.

ఈ నేపథ్యంలో... శాస్త్రవేత్తలకు పలువురు ప్రముఖులు మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ వారిలో ధైర్యాన్ని నింపారు. కాగా.. తాజాగా ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర దీనిపై ఓ ట్వీట్ చేశారు. కాగా ఆయన చేసిన ట్వీట్ ఎందరో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మూన్‌లాండర్‌తో ఇస్రోకు సిగ్నల్స్‌ తెగిపోయిన తర్వాత..‘ సంబంధాలు తెగిపోలేదు. చంద్రయాన్‌ గుండెచప్పుడును ప్రతీ భారత పౌరుడు వినగలుగుతున్నాడు. తొలిసారి విజయం సాధించకపోతే... మళ్లీ మళ్లీ ప్రయత్నించండి అంటూ తాను చెప్పే గుసగుసలు వినగలుగుతున్నాడు’ అని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు.

related news

మీ ఆవేదనను నేను అర్థం చేసుకోగలను... శాస్త్రవేత్తలతో ప్రధాని మోదీ

చంద్రయాన్-2: చంద్రుడికి 2.1కి.మీ దూరంలోనే నిలిచిన విక్రమ్ ల్యాండర్, నో సిగ్నల్స్

చంద్రయాన్-2: ఆ 15 నిమిషాలే కీలకమన్న ఇస్రో ఛైర్మెన్ శివన్

చంద్రయాన్-2 గురించి తెలుసుకోవాల్సిన ఆరు విషయాలు

ఆల్‌ది బెస్ట్ ఇస్రో: కొద్ది గంటల్లో చంద్రుడిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌కు ఏర్పాట్లు పూర్తి.. ప్రత్యక్షంగా వీక్షించనున్న మోడీ

మరో కీలక ఘట్టం: మూడో కక్ష్యలోకి అడుగుపెట్టిన చంద్రయాన్-2

మరో కీలక ఘట్టం: చంద్రుని కక్ష్యలోకి చేరిన చంద్రయాన్-2

చంద్రయాన్-2 సేఫ్ ల్యాండింగ్‌పై పూర్తి విశ్వాసం: ఇస్రో ఛైర్మన్