Asianet News TeluguAsianet News Telugu

వికలాంగురాలిపై లైంగికదాడి.. ఫ్లై ఓవర్‌పై తీసుకెళ్లి...!

రాజస్తాన్‌లో ఘోరం జరిగింది. ఓ వికలాంగ బాలికపై లైంగిక దాడి జరిగింది. అనంతరం ఆమెను ఓ ఫ్లై ఓవర్‌ై వదిలిపెట్టి పోయారు. కాగా, స్థానికులు ఆమెను గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఆమెను జైపూర్ హాస్పిటల్‌కు తరలించారు. ఆమెపై లైంగిక దాడి జరిగిందని వైద్యులు నిర్ధారించారు. అంతేకాదు, ఆ బాలిక ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలిపారు
 

disabled girl raped in rajasthan
Author
Jaipur, First Published Jan 13, 2022, 4:14 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

జైపూర్: బలహీనులైన మహిళల(Women)ను లక్ష్యం చేసుకుని దుండగులు అఘాయిత్యాల(Atrocities)కు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. చిన్న పిల్లలపై లైంగికదాడులు చేసి పరారు కావడం.. ఆ తర్వాత పట్టుబడటం చూస్తున్నాం. బలహీనులు.. చిన్న పిల్లలు, వికలాంగులపై లైంగికదాడికి పాల్పడితే.. విషయం బయటకు తెలియదని వారు భ్రమ పడుతుంటారు. అందుకే వారిని టార్గెట్ చేసుకుని ఈ అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. తాజాగా, రాజస్తాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వికలాంగురాలిపై లైంగిక దాడి చేసి.. నిర్మానుష్యంగా ఉన్న సమయంలో ఆమెను ఓ ఫ్లై ఓవర్ పైకి తీసుకెళ్లి వదిలిపెట్టారు. పోలీసులకు ఆమె అపస్మారక స్థితిలో కనింపించింది.

అల్వార్ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అల్వార్‌లో ఓ ప్రాంతంలోని ఫ్లై ఓవర్‌పై వికలాంగురాలు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. వెంటనే ఆమెకు మెరుగైన చికిత్స అందించడానికి జైపూర్‌కు చెందిన ఓ హాస్పిటల్‌కు చేర్చారు. బాలికకు చికిత్స అందించిన వైద్యులు షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆమెపై లైంగికదాడి జరిగినట్టు తెలిపారు. అంతేకాదు, ఆమె ఆరోగ్యం విషమంగా ఉన్నదనీ వివరించారు. ఆ తర్వాత పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.

పసిపాప మొదలు పండుముసలి వరకు ఎవ్వరినీ వదలడం లేదు కామాంధులు. ఆడది అయితే చాలు తమ వాంఛ తీర్చుకోడాని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు మృగాళ్ళు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణకు ఎన్ని చట్టాలు, పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరించినా అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. ఇక అభం శుభం తెలియని చిన్నారులపై కొందరు నీచులు అత్యాచారాలకు పాల్పడుతూ సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నారు.  

ఇటీవలే ఆంధ్ర ప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో దారుణం వెలుగుచూసింది. మనవరాలి వయసుండే ఓ చిన్నారిపై వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పడిన దారుణం కృష్ణా జిల్లా (krishna district)లో చోటుచేసుకుంది. ఏడేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి యత్నించి వృద్దుడు రెడ్ హ్యాండెడ్ గా స్థానికులకు పట్టుబడ్డాడు.  

మచిలీపట్నం (machilipatnam) మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన ఏడేళ్ల చిన్నారిపై వీరస్వామి అనే వృద్దుడు కన్నేసాడు. తాత వయసుండే అతడిపై చిన్నారితో పాటు తల్లిదండ్రులకు అనుమానం రాలేదు. ఇదే అలుసుగా వృద్దుడు చిన్నారిపై అఘాయిత్యానికి సిద్దపడ్డాడు. 

చిన్నారికి మాయమాటలు చెప్పిన వృద్దుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. అయితే వీరస్వామి వికృత చేష్టలతో భయపడిపోయిన చిన్నారి కేకలు వేసింది. దీంతో స్థానికులు అక్కడికి చేరుకునేసరికి వృద్దుడు చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ కనిపించాడు. ఇది చూసి కొపోద్రిక్తులైన స్థానికులు వృద్దుడిని పట్టుకుని దేహశుద్ది చేసారు.

చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వ‌ృద్దుడిని అదుపులోకి తీసుకున్నారు. మనవరాలి వయసు చిన్నారిపై మృగంలా వ్యవహరించిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. 

 ఇక ఐదేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి లోబర్చుకున్న ఓ యువకుడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ  దారుణం చోటుచేసుకుంది. ఎవరికైనా ఈ విషయం చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాలిక భయపడిపోయి బయటపెట్టలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios