ఆగ్రా: బస్సులో తనపై అత్యాచారం జరిగిందని ఓ యువతి ఆరోపించింది. బస్సులో మరో 45 మంది ప్రయాణికులున్నారని, అయితే వారంతా నిద్రిస్తున్న సమయంలో తనపై ఆత్యాచారం జరిగిందని ఆమె చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 

30 ఏళ్ల యువతి లక్నో నుంచి బస్సులో ఢిల్లీకి ప్రయాణం చేస్తున్న సమయంలో ఆ ఘటన జరిగింది. స్లీపర్ బస్సులో నిద్రిస్తుండగా తనపై బస్సు క్లీనర్ రవి గుప్తా అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో తనపై అత్యాచారం జరిగిందని ఆమె ఫిర్యాదు చేసింది. మర్నాడు ఉదయం ప్రయాణికులు లేచే సరికి రవిగుప్తాను యువతి కొడుతూ కనిపించింది. 

రవి గుప్తా మధ్యలో బస్సు ఎక్కాడని, స్లీపర్ సీటుపై తాను పడుకుని ఉండగా రవిగుప్తా తనపైకి వచ్చాడని, తన దుస్తులు చంచేశాడని, తనపై అత్యాచారం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.