న్యూఢిల్లీ: ఢిల్లీలోని బేగంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దీప్ విహర్ ఏరియాలో గురువారం నాడు ఉదయం పోలీసులు క్రిమినల్స్ కు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు క్రిమినల్స్ తీవ్రంగా గాయపడ్డారు.

లారెన్స్ బిషోయ్ జతేందీ గోన్ గ్యాంగ్ కు చెందిన నలుగురు గాయపడ్డారని పోలీసులు ప్రకటించారు.

రోహిత్, అమిత్, రవీందర్ యాదవ్, సునీల్  లు ఈ ఘటనలో గాయపడ్డారని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో వీరికి పలు చోట్ల గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు.  గాయపడిన వారిని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు.

నిందితుల నుండి కారుతో పాటు నాలుగు ఆటోమెటిక్ ఫిస్టల్స్ ను స్వాధీనం చేసుకొన్నట్టు చెప్పారు. మూడు బుల్లెట్ ఫ్రూప్ జాకెట్లు, హెల్మెట్ లను కూడ కారు నుండి సీజ్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

ప్రత్యర్ధి గ్యాంగ్ సభ్యుడిపై దాడి చేసేందుకు వెళ్లున్నారనే పక్కా సమాచారం ఆధారంగా నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే కాల్పులు జరిపారని పోలీసులు ప్రకటించారు.