న్యూఢిల్లీ: 32 ఏళ్ల మహ్మద్ అయూబ్ అనే వ్యక్తి సెక్స్ వర్కర్ ను చంపాడని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.తనను పెళ్లి చేసుకొనేందుకు ఆమె అంగీకరించని కారణంగా ఆమెను నిందితుడు చంపినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

మహ్మద్ అయూబ్ కు 32 ఏళ్లు. ఆయనకు పెళ్లైంది. భార్య, ముగ్గురు పిల్లలు కూడ ఉన్నారు. అయితే  లత అలియాస్ సల్మా అనే సెక్స్ వర్కర్ ను  ఆ వృత్తి వదిలి తనను పెళ్లి చేసుకోవాలని ఆయన కోరాడు. అయితే ఈ కోరికను  ఆమె తిరస్కరించింది. ఈ కారణంగానే ఆమెను అతను చంపేశాడని పోలీసులు తెలిపారు.

2008లో అయూబ్ పెళ్లి చేసుకొన్నాడు. అయితే వ్యభిచార గృహనికి వెళ్లిన సమయంలో లత అలియాస్ సల్మా పరిచయమైంది. అయితే ఆమెను పెళ్లి చేసుకొంటానని అతను ఆమెకు చెప్పాడు.

పెళ్లి చేసుకొంటానని అయూబ్ చేసిన ప్రతిపాదనను ఆమె పదే పదే తిరస్కరించింది. ఈ ఏడాది ఆగష్టు  20వ తేదీన లత అలియాస్ సల్మాను బవానా కాలువ వద్దకు తీసుకెళ్లాడు.  మరో సారి పెళ్లి గురించి ప్రస్తావించాడు. ఆమె అంగీకరించలేదు.

తన వెంట తెచ్చుకొన్న కత్తితో ఆమెను చంపేశాడు.  ఆమె మృతదేహన్ని  ఐదుబాగాలుగా కోశాడు.  నిందితుడి గురించి  అందిన సమాచారం మేరకు పోలీసులు అయూబ్ ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.