ఓ వైపు ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ రేప్ ఘటనపై దేశం భగ్గుమంటోంది. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ రాజకీయ, పౌర, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయినప్పటికీ దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది.  బారాబంకిలో 18 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమె గొంతుకోసి దారుణంగా హత్య చేశారు.

బుధవారం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన కుమార్తె ఎంతకీ తిరిగి రాకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడికి వెళ్లి చూడగా ఆమె రక్తపుమడుగులో పడి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా హత్య చేసే ముందు దుండగులు ఆమెపై అత్యాచారం చేసినట్లుగా వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించామని .. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.