MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ హీరో చేత చీర కట్టించుకోవాలనే కోరిక.. అందరి ముందు బోల్డ్ గా చెప్పేసిన టాలీవుడ్ యాంకర్, ట్రోలింగ్

ఆ హీరో చేత చీర కట్టించుకోవాలనే కోరిక.. అందరి ముందు బోల్డ్ గా చెప్పేసిన టాలీవుడ్ యాంకర్, ట్రోలింగ్

టాలీవుడ్ యాంకర్స్ లో ఒకరైన గీతా భగత్ సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, మూవీ ప్రెస్ మీట్స్ ఇలా మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్ కి ఎక్కువగా ఆమే కనిపిస్తూ ఉంటారు.

2 Min read
Author : Tirumala Dornala
Published : May 06 2024, 10:26 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ యాంకర్స్ లో ఒకరైన గీతా భగత్ సినిమా ఈవెంట్స్ తో బిజీ బిజీగా గడుపుతున్నారు. ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, మూవీ ప్రెస్ మీట్స్ ఇలా మీడియం రేంజ్ చిత్రాల ఈవెంట్స్ కి ఎక్కువగా ఆమే కనిపిస్తూ ఉంటారు. వేదికపై తనదైన శైలిలో జోకులు వేస్తూ షోని నడిపించడం ఆమె శైలి. 

27

ఎలాంటి ఈవెంట్స్ లో అయినా అతిథులతో పాటు యాంకర్స్ చేసే కామెంట్స్ కూడా వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు ట్రోలింగ్ కి కూడా గురవుతుంటారు. యాంకర్ సుమ, శ్రీముఖి లాంటి వాళ్ళు గతంలో ఏదో చెప్పబోయి ఇంకేదో మాట్లాడి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. 

37

తాజాగా యాంకర్ గీతా భగత్ కూడా ట్రోలింగ్ కి గురయ్యారు. ఇటీవల రాజ్ తరుణ్ నటించిన భలే ఉన్నాడే చిత్ర టీజర్ లాంచ్ జరిగింది. టీజర్ లో కంటెంట్ ని తాను కూడా ఇంప్రొవైజ్ చేయాలని అనుకుంది. 

47

సందర్భం రాగానే బోల్డ్ గా మాట్లాడేసింది. భలే ఉన్నాడే చిత్ర కథ టీజర్ ని బట్టి అర్థం అవుతోంది. సిటీల్లో జరిగే ఈవెంట్స్ కి ఆడవాళ్ళకి చీర కట్టుకోవడంలో సాయం చేసే వ్యక్తిగా రాజ్ తరుణ్ నటిస్తుంటాడు. ఈ సీన్స్ లో టీజర్ లో ఫన్నీగా, రొమాంటిక్ గా చూపించారు. 

57

రచయిత డార్లింగ్ స్వామి ఈవెంట్ లో ప్రసంగిస్తూ..యాంకర్ గీతాని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఇంత మాట్లాడుతున్నారు.. మీరెందుకు చీర కట్టుకుని రాలేదు అని అడిగారు. దీనితో యాంకర్ గీతా బదులిస్తూ.. నాకు హీరో రాజ్ తరుణ్ చేత చీర కట్టించుకోవాలని ఉన్నట్లు గీతా భగత్ తన కోరిక బయట పెట్టింది. 

67

ఆమె మాటలకు అక్కడున్న వారంతా నవ్వేశారు కానీ.. ఆ తర్వాత ఆన్లైన్ లో గీతా భగత్ పై ట్రోలింగ్ జరిగింది.వైరల్ కావడం కోసం నోటికి ఎంతొస్తే అంత మాట్లాడేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హీరో చేత చీర కట్టించుకోవడం ఏంటి అంటూ ట్రోలింగ్ షురూ చేశారు. 

77

గతంలో గీతా భగత్ పై కొన్ని కాంట్రవర్సీలు కూడా వైరల్ అయ్యాయి. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో తీవ్ర వివాదాలు జరిగాయి. పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: సొంత ఇంటికే కన్నం వేసిన ఐశ్వర్య, దొంగలను చితక్కొట్టిన ఇందు, నందు
Recommended image2
Karthika Deepam 2 Today Episode:దీప భయం-మెంటల్ షాక్‍లో సుమిత్ర-దశరథ కంగారు-జ్యోకు కార్తీక్ వార్నింగ్
Recommended image3
Stars with Kids: సొంత పిల్లలతో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోల లిస్ట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved