న్యూఢిల్లీ: సీబీఐ ఉన్నతాధికారుల మధ్య అంతర్యుద్ధం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సీబీఐ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ పార్టీ శుక్రవారం నాడు ఆందోళనకు దిగింది. న్యూఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ నేతృత్వంలో  ఆ పార్టీ నేతలు  ఆందోళనకు దిగారు. అందోళనకు దిగిన రాహుల్ ‌గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఢిల్లీ నగర వీధుల్లో రాహుల్ గాంధీ వెంట ఆ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయం నుండి  సీబీఐ ప్రధాన కార్యాలయం వరకు ర్యాలీ సాగింది.

సీబీఐ ప్రధాన కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో  పోలీసులు  వాటర్ క్యానాన్లను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చెదరగొట్టారు.

 సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద  పోలీసులకు , కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య  గొడవ చోటు చేసుకొంది. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది. మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.ఆందోళనకు దిగిన రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాఫెల్ కుంభకోణాన్ని సీబీఐ డైరెక్టర్ విచారణ చేస్తున్నందునే ఆయనను పదవి నుండి తప్పించారని కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌కు సుప్రీం షాక్: విధాన నిర్ణయాలొద్దు

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా