Asianet News TeluguAsianet News Telugu

చ‌ట్ట‌స‌భ‌ల్లో మ‌హిళా రిజ‌ర్వేషన్లు క‌ల్పించ‌డం ఉత్త‌ర భారతానికి, పార్లమెంట్ కు ఇష్టం లేదు - శరద్ పవార్

మహిళా నాయకత్వాన్ని ఉత్తర భారతదేశం, పార్లమెంట్ మనస్థత్వం ఇప్పటికీ అంగీకరించడం లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్ ఆమోదించేలా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

North India and Parliament don't like reservation for women in legislatures - Sharad Pawar
Author
First Published Sep 18, 2022, 12:19 PM IST

లోక్‌సభ, శాసనసభల్లో మహిళలకు రిజర్వేషన్లు క‌ల్పించడం ఉత్తర భారతదేశానికి, పార్ల‌మెంట్ కు ఇప్ప‌టికీ ఇష్టం లేద‌ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ శనివారం అన్నారు. మ‌హరాష్ట్రలోని పూణే సిటీలో పూణె డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వ‌ర్యంలో శ‌నివారం ఏర్పాటు చేసిన ఓ కార్య‌క్ర‌మంలో ఆయ‌న త‌న కుమార్తె, లోక్‌సభ ఎంపీ సుప్రియా సూలేతో క‌లిసి ముఖాముఖిలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఈ వ్యాఖ్యలు చేశారు.

పంజాబ్ లో 60 మంది విద్యార్ధినుల నగ్న వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్: బాధితుల ఆందోళన

లోక్‌సభ, అన్ని రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 33 శాతం సీట్లను రిజర్వ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా ఆమోదం పొంద‌లేద‌నే ఓ ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇస్తూ.. మహిళల నాయ‌క‌త్వం అంగీకరించడానికి దేశం ఇప్పటికీ మానసికంగా సిద్ధంగా లేద‌ని ఈ విష‌యం స్ప‌ష్టం చేస్తోంద‌ని అన్నారు. తాను లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పటి నుంచి పార్లమెంట్‌లో ఈ అంశంపై మాట్లాడుతున్నానని పవార్ చెప్పారు.

పార్టీ జాతీయ అధ్య‌క్షుడిగా రాహుల్ గాంధే ఉండాలి- రాజ‌స్థాన్ కాంగ్రెస్ తీర్మానం

‘‘ పార్లమెంటు మనస్తత్వం, ముఖ్యంగా ఉత్తర భారతదేశం ఈ సమస్యపై అనుకూలంగా లేదు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్‌సభ ఎంపీగా ఉన్న స‌మ‌యంలో మహిళలకు రిజర్వేషన్ల సమస్యపై మాట్లాడేవాన్ని. నాకు ఇప్ప‌టికీ గుర్తుంది. ఒక సారి పార్లమెంట్‌లో ఈ విష‌యంపై నా ప్ర‌సంగం పూర్తి అయిన త‌రువాత వెనక్కి తిరిగాను. మా పార్టీకి చెందిన మెజారిటీ ఎంపీలు లేచి వెళ్లిపోయారు. అంటే నా పార్టీకి చెందిన వారు కూడా ఇది జీర్ణించుకోలేకపోయారు.

తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లా ప‌రిష‌త్, పంచాయ‌తీ సమితి వంటి స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టాన‌ని శరద్ పవార్ తెలిపారు. అయితే దీనిని మొదట వ్యతిరేకించార‌ని, కానీ తరువాత ప్రజలు అంగీకరించార‌ని చెప్పారు. కాగా.. చ‌ట్ట స‌భ‌ల్లో మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే బిల్లు పార్ల‌మెంట్ లో ఆమోదం పొందేందుకు అన్ని పార్టీలు ప్రయత్నిస్తూనే ఉండాలని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios