తమిళనాడు కాంచీపురంలో దారుణం: బోయ్‌ఫ్రెండ్ ముందే విద్యార్ధినిపై గ్యాంగ్ రేప్
తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో 20 ఏళ్ల కాలేజీ విద్యార్ధినిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరొకరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. బోయ్ ఫ్రెండ్ ముందే అతని ప్రియురాలిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఈ నెల 12వ తేదీన జరిగిందిన పోలీసులు ప్రకటించారు.ఈ నెల 12న కాంచీపురం జిల్లాలోని ఓ మారుమూల ప్రాంతంలో సాయంత్రం పూట తన ప్రియుడితో కలిసి విద్యార్ధిని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. విద్యార్ధిని ఆమె బోయ్ ఫ్రెండ్ క్లాస్ మేట్స్.
మద్యం మత్తులో ఉన్న ఇద్దరు తమ ముఖానికి మాస్క్ తగిలించుకుని వచ్చారు. ఒంటరిగా వెళ్తున్న కాలేజీ విద్యార్ధిని అతని ప్రియుడిపై దాడికి దిగారు. ఈ ఇద్దరికి మరో నలుగురు తోడయ్యారు. యువతి బోయ్ ఫ్రెండ్ ను కట్టేసి యువతిపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యువతిని నిందితులు కత్తితో బెదిరించారు. రోడ్డు పక్కనే చీకట్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిపై ఆరుగురు అత్యాచారానికి పాల్పడినట్టుగా పోలీసులు గుర్తించారు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన వారిలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ ఘటనలో పాల్గొన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు వివరించారు.