స్నేహితుడని ఇంటికి వెళ్తే రేప్ చేశాడు, బాధితురాలు ఏం చేసిందంటే?

Canadian woman raped by man she met at Delhi pub
Highlights

విదేశీ యువతిపై రేప్


న్యూఢిల్లీ:  ఓ విదేశీ మహిళపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని 24 గంటల్లోపే పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు.

కెనడాకు చెందిన ఓ మహిళ మంగళవారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని హాజ్‌ ఖాస్‌ ఏరియాలో ఓ పబ్‌కు వెళ్లారు. అదే పబ్‌కు వచ్చిన అభిషేక్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. వారిద్దరూ ఫ్రెండ్స్‌గా మారడంతో అడ్రస్‌లు, ఫోన్‌ నెంబర్‌లు ఇచ్చి పుచ్చుకున్నారు. స్నేహితులతో కలిసి బాధితురాలు ఆరోజు ఇంటికి వెళ్లిపోయారు. 

ఆ మరుసటిరోజు నిందితుడు అభిషేక్‌ కెనడా స్నేహితురాలికి ఫోన్‌ చేసి ఇంటికి ఆహ్వానించాడు. ఫ్రెండ్‌ అని అభిషేక్‌ను నమ్మి అతడి ఇంటికి వెళ్లింది. అయితే అదే అదనుగా భావించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 

అభిషేక్ నుండి తప్పించుకొన్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని  నిందితుడు అభిషేక్‌ను అరెస్ట్ చేశారు. 
 

loader