న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై పవర్ ఫుల్ వ్యాఖ్యలు చేశారు లడఖ్ బీజేపీ ఎంపీ జమ్మంగ్ త్సేరింగ్ నంగ్యల్. లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించినందుకు ప్రధాని నరేంద్రమోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు తెలిపారు. 

జమ్ముకశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుపై లోక్ సభ, రాజ్యసభలలో కాంగ్రెస్, పీడీపీ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్గిల్ గురించి వారికి ఏం తెలుసునంటూ నిలదీశారు. జమ్ముకశ్మీర్ లో యూనిటీ ఎక్కడ ఉందో చెప్పాలని ప్రశ్నించారు. జమ్ముకశ్మీర్ గురించి పదేపదే ప్రస్తావిస్తున్న నేతలకు లడఖ్ గురించి ఏమి తెలుసనని ప్రశ్నించారు. 

జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక అధికారాలు కల్పిస్తున్న ఆర్టికల్ 370 వల్ల లడఖ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. జమ్ముకశ్మీర్ పాలనలో లడఖ్ ప్రజలు అభివృద్ధిని చూడలేదన్నారు. తమ పోరాటాలను గానీ తమ హక్కుల గురించి గానీ ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 

ఒకే దేశం, ఒకే జెండా,ఒకే రాజ్యాంగం అంటూ తమ పార్టీ చేస్తున్న కృషికి తాను గర్విస్తున్నట్లు తెలిపారు లడఖ్ బీజేపీ ఎంపీ జమ్యంగ్ త్సేరింగ్ నమ్‌గ్యల్. తన మాటల తూటాలతో లోక్ సభను తన ఆధీనంలో తీసుకున్నారు నమ్ గ్యల్. పొలిటికల్ పంచ్ లతో, కవితలతో అదరహో అనిపించారు.

నంగ్యల్ ప్రసంగం ఆద్యంతం బీజేపీ ఎంపీలు చప్పట్లు కొడుతూ, బల్లలు చరుస్తూ హల్ చల్ చేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతోపాటు రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్, స్మృతి ఇరానీలు సైతం బల్లలు చరుస్తూ మద్దతు పలికారు.
  
గత 71ఏళ్లుగా లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతం హోదా కోసం పోరాడుతోందని తెలిపారు. లడఖ్‌కు చాలా ప్రత్యేక సంస్కృతి, సంప్రదాయాలు కశ్మీరీలకంటే భిన్నంగా ఉంటాయని తెలిపారు. తమ భాష వేరు, లిపి వేరు అని చెప్పుకొచ్చారు. 

తమ డిమాండ్ ను పదేపదే జమ్ముకశ్మీర్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే తమను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కశ్మీరీల ఆధిపత్యంగల ప్రభుత్వం తమ డిమాండ్లను ఏనాడు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

కశ్మీరుతో కలిసి ఉండాలని లడఖ్ ప్రజలు ఎప్పుడూ కోరుకోలేదని తెలిపారు. ఆర్టికల్ 370 వల్ల కేవలం రెండు కుటుంబాలు, మూడు పార్టీలు మాత్రమే లాభపడ్డాయంటూ పంచ్ డైలాగులు పేల్చారు. కేంద్ర పాలిత ప్రాంతం హోదా కావాలని డిమాండ్ చేసిన లడఖ్‌కు చెందిన పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీల జిల్లా అధ్యక్షులను పదవుల నుంచి తొలగించిన విషయం వాస్తవం కాదా అంటూ నిలదీశారు. 

జమ్ముకశ్మీర్ ప్రభుత్వంలో లడఖ్ కు తీవ్ర అన్యాయం జరుగుతూనే ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు జమ్ము, కశ్మీర్ లలో సెంట్రల్ యూనివర్శిటీ తెచ్చుకున్నారని  కానీ లడఖ్ లాంటి చిన్న జిల్లాను మాత్రం పట్టించు కోలేదన్నారు. 

లడఖ్ కు సెంట్రల్ యూనివర్శిటీ కోసం విద్యార్థులు రోడ్డులు ఎక్కి నిరసనలు చేపట్టారని తెలిపారు. తలకు బ్యాడ్జ్ లు ధరించి పోరాటాలు చేసిన విషయాలను గుర్తు చేశారు. లడఖ్ లో ఒక బీహార్ తరహా యూనివర్శిటీ తప్ప వేరే యూనివర్శిటీ లేదని విమర్శించారు. 

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రమే లడఖ్‌కు సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేశారని తెలిపారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు లడఖ్ లడఖ్ అంటూ పెద్ద గొంతులతో మాట్లాడుతున్నారని వారికి లడఖ్ గురించి ఏమి తెలుసు వారి కష్టాలు ఏం తెలుసునని ప్రశ్నించారు. 

గత ప్రభుత్వాల హయాంలో కశ్మీరీలను, డోగ్రాలను గుర్తించారు కానీ లడఖ్ ప్రజలను గుర్తించలేదంటూ చెప్పుకొచ్చారు. ఆర్టికల్ 370ని అధికార పార్టీలు దుర్వినియోగపరిచారని ఆరోపించారు. జమ్మూ-కశ్మీరులో బౌద్ధులను అంతం చేసేందుకు ప్రయత్నించారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

71 ఏళ్ల తర్వాత అయినా లడఖ్ ప్రజల కోరిక నెరవేరినందుకు సంతోషిస్తున్నట్లు తెలిపారు. లడఖ్ ను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించిన ప్రధాని నరేంద్రమోదీకి, హోంశాఖ మంత్రి అమిత్ షాకి ధన్యవాదాలు తెలిపారు లడఖ్ ఎంపీ జమ్మంగ్ త్సేరింగ్ నంగ్యల్

ఈ వార్తలు కూడా చదవండి

ఒకేదేశం, ఒకే జెండా మాదీ అదే నినాదం: లోక్ సభలో ఆర్టికల్ 370 రద్దుకు వైసీపీ మద్దతు

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

70ఏళ్లనాటి తప్పును సరిచేశారు: ఆర్టికల్ 370 రద్దుపై లోక్ సభలో ఎంపీ గల్లా జయదేవ్

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా