న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఒకే దేశం, ఒకే జెండా నినాదం మంచిదేనని ఆ నిర్ణయం తమకు సమ్మతమేనని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. 

జమ్ము కశ్మీర్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుపై మాట్లాడిన ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆర్టికల్‌ 370 రద్దు తీర్మానం, జమ్మూకశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు తమ మద్దతు ప్రకటించారు.  

జమ్మూకశ్మీర్‌ విషయంలో దశాబ్దాల కల నెరవేరుతుండటం సంతోషంగా ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల జమ్మూకశ్మీర్‌లో మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్టు స్పష్టం చేశారు. 

ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని, కశ్మీర్‌ పునర్విభజన బిల్లుకు తమ మద్దతు ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో జమ్మూకశ్మీర్‌  మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్టికల్ 370 రద్దుకు మద్దతివ్వం, వ్యతిరేకించం: టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ

ఆర్టికల్ 370 రద్దు చేస్తారా, ఆ అధికారం పార్లమెంట్ కు ఉంది: లోక్ సభలో తివారీ వర్సెస్ షా

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా