Asianet News TeluguAsianet News Telugu

రాసలీలల కేసు : సీడీ విషయం ముందే తెలుసు.. ఐదు కోట్లకు డిమాండ్... !

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వీడియోలో కనిపించి పదవి కోల్పోయిన మాజీ మంత్రిని మంగళవారం సిట్ అధికారులు బెంగళూరులోని ఆయన నివాసంలో రెండు గంటలపాటు విచారించారు. నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 

bangalore sex scandal case :  SIT records ramesh jarkiholi satement - bsb
Author
Hyderabad, First Published Mar 17, 2021, 9:44 AM IST

కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జార్కిహోళి రాసలీలల కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. వీడియోలో కనిపించి పదవి కోల్పోయిన మాజీ మంత్రిని మంగళవారం సిట్ అధికారులు బెంగళూరులోని ఆయన నివాసంలో రెండు గంటలపాటు విచారించారు. నాలుగు పేజీల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 

ఆ వీడియో గురించి తనకు నాలుగు నెలల ముందే తెలుసని రమేష్ చెప్పడంతో సిట్ అధికారులు షాక్ అయ్యారు. ఆ వీడియోను చూపించి తనను రూ. ఐదుకోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. అయితే తాను ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదని తెలిపారు. అంతేకాదు, తన రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ఇలా నకిలీ సీడీతో కుట్ర పన్నారని అన్నారు. వీడియోలో ఉన్నది తాను కాదని, ఆ సీడీకి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. 

కాగా రాసలీలల వీడియోలో కనిపించే యువతి కోసం సిట్ అధికారులు గాలింపు మొదలుపెట్టారు. ముందుగా... ఈ వీడియో బయటకు రాగానే.. యువతి గోవా వెళ్లిందనే సమాచారం అందింది. అక్కడ గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. కాగా.. గోవా నుంచి ఆమె బెంగళూరుకి.. అక్కడి నుంచి ముంబయికి.. అక్కడి నుంచి తిరుపతి ఆ తర్వాత హైదరాబాద్ కి చేరినట్లు సమాచారం అందింది.

ఈ క్రమంలో ఆమె కోసం హైదరాబాద్ లో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా.. తనను మోసగించారని, బెదిరించారని మాజీ మంత్రిపై యువతి సోషల్‌ మీడియా ద్వారా బెంగళూరు కబ్బన్‌పార్కు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు. విచారణకు రావాలని బాగల్‌కోటలో ఆమె ఇంటికి నోటీసులు అతికించినప్పటికీ ఆమె నుంచి స్పందన లేదు.  

ఖాతాలోకి 25 లక్షలు: ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీడీని సామాజిక కార్యకర్త దినేశ్‌ కల్లహళ్లికి అందజేసిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతాలోకి రూ.25 లక్షల నగదు జమ అయినట్లు పోలీసుల విచారణలో తేలింది. సదరు వ్యక్తిని విచారణ చేస్తున్నారు. వీడియోలో వినిపించిన గొంతు మీద అనుమానంతో  చిక్కమగళూరుకు చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్వర నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపారు.

Follow Us:
Download App:
  • android
  • ios