Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. 15 ఏళ్ల దళిత బాలికపై గ్యాంగ్ రేప్.. నిందితుల్లో ఒకరు మైనర్.. ఎక్కడంటే ?

ఉత్తరప్రదేశ్ లో దారుణం వెలుగు చూసింది. ఓ దళిత మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఒకరు మైనర్. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు ఇప్పటి వరకు అరెస్టు చేశారు. వారిని జ్యూడిషియల్ రిమాండ్ కు తరలించారు. 

Atrocious.. Gang rape of a 15-year-old Dalit girl.. One of the accused is a minor.. Where?
Author
First Published Dec 20, 2022, 2:14 PM IST

మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఎన్ని చట్టాలు తెచ్చినా కామాంధులకు భయం వేయడం లేదు. నిత్యం ఎక్కడో ఒక చోట మహిళపై అఘాయిత్యాలు జరిగిన ఘటనలు వెలుగులో వస్తూనే ఉన్నాయి. చిన్నారులు, ముసలివాళ్లు అని కూడా చూడకుండా మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తున్నారు. దివ్యాంగులు అని జాలి కూడా చూపకుండా అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ దళిత మైనర్ బాలికపై కొందరు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

పొలిటికల్ యాడ్స్ కోసం ఖర్చు పెట్టిన రూ. 97 కోట్లు రికవరీ చేయండి.. చీఫ్ సెక్రెటరీకి ఢిల్లీ ఎల్జీ ఆదేశాలు

వివరాలు ఇలా ఉన్నాయి. గ్రేటర్ నోయిడా పరిధిలోని కస్నా గ్రామంలో 15 ఏళ్ల దళిత బాలిక నివసిస్తోంది. అయితే తన 15 ఏళ్ల స్నేహితుడు అనారోగ్యానికి గురవడంతో అతడిని చూసేందుకు గత శనివారం అద్దె గదికి వెళ్లింది. అయితే అతడికి తెలిసిన మరో ఇద్దరు వ్యక్తులు ఆ సమయంలో ఇంట్లో ఉన్నారు. ఆమె లోపలికి ప్రవేశించగానే లోపలి నుంచి తలుపులకు తాళం వేశారు. అనంతరం ఆమెపై ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

అనంతరం అక్కడి నుంచి బాలిక ఎలాగోలా తప్పించుకొని తన ఇంటికి చేరుకుంది. తనపై జరిగిన అఘాయిత్యాన్ని కుటుంబ సభ్యులకు వివరించింది. దీంతో కుటుంబ సభ్యులను పోలీసులను ఆశ్రయించారు. నిందితలుపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. 

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో భగవద్గీత ప్రస్తావన.. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం

ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక బంధువు డిసెంబర్ 17న ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. నిందితులపై భారతీయ శిక్షాస్మృతి 376డీ (గ్యాంగ్‌రేప్), 363 (తప్పిపోవడం), 342 (తప్పుగా నిర్బంధించడం), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం) వంటి సెక్షన్‌లు నమోదు చేసినట్టు తెలిపారు. వారిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు వారు తెలిపారు.

ఇదే రాష్ట్రంలోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో నవంబర్ 28వ తేదీన ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. జెత్వారా గ్రామానికి చెందిన 15 ఏళ్ల దళిత బాలిక నవంబర్ 26వ తేదీ (శనివారం) రాత్రి సమయంలో మలవిసర్జన కోసం బయటకు వెళ్లింది. అయితే అదే గ్రామానికి చెందిన 14, 17 ఏళ్ల ఇద్దరు మైనర్ బాలురు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.

తాజ్ మహల్ ఆస్తి పన్ను, నీటి బిల్లులు.. ఆగ్రా కోటకు మరోటి.. రూ. కోటికి పైగా బకాయిలు చెల్లించాలని నోటీసులు...

ఇంటికి తిరిగి వచ్చిన బాలిక ఈ విషయాన్ని బంధువులకు తెలియజేసింది. దీంతో వారు మరుసటి రోజు పోలీసులను ఆశ్రయించారు. అత్యాచారానికి ఒడిగట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులపై  సంబంధిత సెక్షన్లు, ఎస్సీ,ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కు తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios