Asianet News TeluguAsianet News Telugu

పొలిటికల్ యాడ్స్ కోసం ఖర్చు పెట్టిన రూ. 97 కోట్లు రికవరీ చేయండి.. చీఫ్ సెక్రెటరీకి ఢిల్లీ ఎల్జీ ఆదేశాలు

కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రభుత్వ యాడ్స్ పేరిట పొలిటికల్ యాడ్స్ పబ్లిష్ చేశారని, సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు, సీసీఆర్‌జీఏ ఆదేశాలను ఉల్లంఘిస్తూ యాడ్స్ పై ఖర్చు పెట్టిన రూ. 97 కోట్లను వెంటనే రికవరీ చేయాలని చీఫ్ సెక్రెటరీకి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆదేశాలు జారీ చేశారు.
 

recover rs 97 crore used by aap for political ads, delhi lg vk saxena orders chief secretary
Author
First Published Dec 20, 2022, 1:15 PM IST

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య మరో కొత్త వివాదం ముందుకు వచ్చింది. ప్రభుత్వ యాడ్స్ పేరిట పొలిటికల్ యాడ్స్‌కు అధికారిక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ రూ. 97 కోట్లు వెచ్చించిందని, వాటిని వెంటనే రికవరీ చేయాలని చీఫ్ సెక్రెటరీని ఎల్జీ వీకే సక్సేనా ఆదేశించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు, 2016లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు, ప్రభుత్వ అడ్వర్టైజింగ్ కంటెంట్ రెగ్యులేషన్ కమిటీ (సీసీఆర్‌జీఏ) 2016లో జారీ చేసిన ఆదేశాలను రూలింగ్ పార్టీ ఉల్లంఘించిందని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పేర్కొన్నారు.

ప్రభుత్వం చేసిన అడ్వర్టైజ్‌మెంట్లు కొన్ని తీవ్ర ఉల్లంఘనలు ఉన్నాయని, అలాంటి యాడ్స్ పై చేసిన ఖర్చులను లెక్కించాలని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ (డీఐపీ)కు సీసీఆర్‌జీఏ ఆదేశాలు చేశారు. ఇలాంటి యాడ్స్‌ను గుర్తించి, అందుకు వెచ్చించిన మొత్తం రూ. 97,14,69,137లు అని డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ తేల్చింది.

ఇందులో సుమారు రూ. 42.26 కోట్ల మొత్తం ఇప్పటికే డీఐపీ విడుదల చేసిందని, మరో రూ. 54.87 కోట్లు పబ్లిష్ చేసిన యాడ్స్‌కు చెల్లించాల్సి ఉన్నదని కొన్ని వర్గాలు వివరించాయి. దీంతో 2017లో రూ. 42.26 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెంటనే చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీని 2017లో డీఐపీ ఆదేశించింది. మిగిలిన రూ. 54.87 కోట్ల పెండింగ్ అమౌంట్‌ను నేరుగా అడ్వర్టైజింగ్ ఏజెన్సీలు, పబ్లికేషన్లకు 30 రోజుల అవధిలో చెల్లించాలని ఆదేశించింది.

ఈ ఆదేశాలను డీఐపీ జారీ చేసి ఐదేళ్లు గడుస్తున్నా ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకా వాటిని పాటించలేదు.

Also Read: "మీరు తిట్టినంతంగా నన్ను మా భార్య‌ కూడా తిట్టదు".. లెఫ్టినెంట్ గవర్నర్ పై కేజ్రీవాల్ సెటైర్

అంతేకాదు, కేజ్రీవాల్ ప్రభుత్వ ఏర్పాటు చేసిన పబ్లిక్ ఏజెన్సీ శబ్దార్థ్ ఆర్థిక వ్యవహారాలనూ ఆడిట్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ అదనంగా ఆదేశాలు ఇచ్చారు. శబ్దార్థ్‌లో ప్రస్తుతం 35 మంది పని చేస్తున్నారు. వారంతా కాంట్రాక్చువల్ లేదా ఔట్ సోర్సింగ్‌లో పని చేస్తున్నవారే. ఈ ఏజెన్సీలో పని చేయడానికి 38 మందికి అవకాశం ఉన్నది. ఈ ఏజెన్సీలో ప్రైవేటు వ్యక్తులకు బదులు ప్రభుత్వ సేవకులు పని చేయాల్సి ఉన్నది. కానీ, ప్రస్తుతం 35 మంది ప్రైవేటు వ్యక్తులు పని చేస్తున్నారు.

దీంతో శబ్దార్థ్‌లో కాంట్రాక్చువల్ లేదా ఔట్‌సోర్సింగ్ సిబ్బంది కాకుండా ప్రభుత్వ అధికారులే పని చేయాలని ఎల్జీ ఆదేశాలు జారీ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios