Asianet News TeluguAsianet News Telugu

ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో భగవద్గీత ప్రస్తావన.. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం

భగవద్గీతకు సంబంధించి శ్లోకాలను ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించినట్టుగా కేంద్రం తెలిపింది. ఈ మేరకు సోమవారం లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Bhagavad Gita mentioned in NCERT textbooks Says Centre
Author
First Published Dec 20, 2022, 12:42 PM IST

భగవద్గీతకు సంబంధించి శ్లోకాలను ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాల్లో ప్రస్తావించినట్టుగా కేంద్రం తెలిపింది. 6,7వ తరగతుల ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకాలలో భగవద్గీత ప్రస్తావనలు, అలాగే పదకొండో, పన్నెండో తరగతుల సంస్కృత పాఠ్యపుస్తకాలలో శ్లోకాలను చేర్చినట్లు సోమవారం లోక్‌సభలో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. భారతీయ నాలెడ్జ్ సిస్టమ్స్ అన్ని అంశాలపై పరిశోధన, తదుపరి పరిశోధన, సామాజిక అనువర్తనాల కోసం పరిజ్ఞానాన్ని సంరక్షించడం, వ్యాప్తి చేయడంపై ఇంటర్ డిసిప్లినరీ, ట్రాన్స్-డిసిప్లినరీ పరిశోధనలను ప్రోత్సహించే లక్ష్యంతో 2020లో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ)లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ (ఐకెఎస్) విభాగాన్ని మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని అన్నపూర్ణా దేవి తెలిపారు. 

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఈఆర్‌టీ) నేషనల్ కరికులం ఫ్రేమ్‌వర్క్‌ల అభివృద్ధిని ప్రారంభించిందని.. ఇందుకోసం వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోని క్షేత్రస్థాయిల నుంచి, నిపుణుల నుంచి ఇన్‌పుట్‌లను ఆహ్వానించామని అన్నపూర్ణా దేవి తెలిపారు. 

జాతీయ విద్యా విధానం 2022 పేరా 4.27 భారతదేశం సాంప్రదాయ జ్ఞానాన్ని సూచిస్తుందని.. ఇది సుస్థిరమైనదని, అందరి సంక్షేమం కోసం కృషి చేస్తుందని ఆమె చెప్పారు. ‘‘"ఈ శతాబ్దంలో జ్ఞాన శక్తిగా ఎదగాలంటే.. మనం మన వారసత్వాన్ని అర్థం చేసుకోవాలి. ప్రపంచానికి 'భారతీయ మార్గాన్ని' నేర్పించాలి’’ అని కూడా పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios