Asianet News TeluguAsianet News Telugu

న్యాయ వ్య‌వ‌స్థ‌ సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డం అభినంద‌నీయం - ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ

కరోనా కాలంలో ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ఈ-కోర్టులు నేడు వ్యవస్థలో ఒక భాగంగా మారాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. యూపీఐని మొదలు పెట్టినప్పుడు కొన్ని రంగాలకే పరిమితం అవుతుందని అందరూ అనుకున్నారనీ కానీ నేడు అది అన్ని రంగాలకు పరిమితం అయ్యిందని చెప్పారు. 

Adoption of legal system technology is appreciable - PM MODI
Author
New Delhi, First Published Jul 30, 2022, 2:54 PM IST

భారతదేశం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకలు జ‌రుపుకుంటోంద‌ని, ఈ తరుణంలో న్యాయ వ్య‌వ‌స్థ పెరిగిన సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డం అభినంద‌నీయం అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. శ‌నివారం ఆయ‌న విజ్ఞాన్ భవన్‌లో జరిగిన మొదటి అఖిల భారత జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశ ప్రారంభ సెషన్‌లో మోదీ మాట్లాడారు. కొన్నేళ్ల క్రితం భీమ్/యూపీఐని ప్రవేశపెట్టినప్పుడు అవి చిన్న రంగానికే పరిమితం అవుతుందని కొందరు భావించారని అన్నారు. కానీ నేడు గ్రామాల్లో కూడా డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయని అని ఆయ‌న అన్నారు. ప్రపంచంలోని మొత్తం రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపులలో 40 శాతం భారతదేశంలోనే జరుగుతున్నాయని ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్‘ నివేదించింది. 

గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబై ఆర్థిక రాజ‌ధానిగా ఉండ‌దు - మహారాష్ట్ర గవర్నర్.. మండిప‌డ్డ విప‌క్షాలు

సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దేశంలోని న్యాయవ్యవస్థ తన పనిలో సాంకేతికతను అనుసరించే దిశలో వేగంగా ముందుకు సాగడం సంతోషంగా ఉందని మోదీ అన్నారు. ఈ-కోర్టుల మిషన్ కింద దేశంలో వర్చువల్ కోర్టులు ప్రారంభమవుతున్నాయని ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కోర్టులు ఇప్పటివరకు 1 కోటి కంటే ఎక్కువ కేసులను విచారించాయని, హైకోర్టులు, సుప్రీంకోర్టులో సుమారు 60 లక్షల కేసులు విచారించాయని తన‌కు చెప్పార‌ని అన్నారు. ‘‘ కరోనా సీజన్ లో ఇది ఒక ప్ర‌త్యామ్నాయంగా మారింది. కానీ ఇప్పుడ‌ది వ్య‌వ‌స్థ‌లో ఒక భాగంగా మారింది. మన న్యాయవ్యవస్థ ప్రాచీన భారతీయ న్యాయ విలువలకు కట్టుబడి ఉందని, అదే సమయంలో 21వ శతాబ్దపు వాస్తవాలతో సరిపోలడానికి సిద్ధంగా ఉందని ఇది రుజువు.’’ అని తెలిపారు.

న్యాయం అందించడంలో న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని, గత ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి వేగంగా పనులు జరిగాయని, దీని కోసం రూ. 9,000 కోట్లు వెచ్చించామని ప్రధాని అన్నారు. దీనివల్ల న్యాయవిచారణలో వేగం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని హక్కులు మరియు విధుల గురించి సామాన్య పౌరులు తెలుసుకునేలా చేయడంలో సాంకేతికత కూడా పెద్ద పాత్ర పోషిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు.

అమృత్‌కాల్ అనేది కర్తవ్య కాలమని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి, ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురైన రంగాలపై మనం కృషి చేయాలని అన్నారు. అండర్ ట్రయల్ ఖైదీల పట్ల సున్నితంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకతను ఎత్తి చూపుతూ, న్యాయం కోసం ఇంకా చాలా మంది ఎదురుచూస్తున్నారని తెలిపారు. అలాంటి ఖైదీలకు న్యాయ సహాయం అందించే బాధ్యతను జిల్లా న్యాయసేవా అధికారులు తీసుకోవచ్చని అన్నారు. అండర్ ట్రయల్ రివ్యూ కమిటీల అధ్యక్షులుగా జిల్లా న్యాయమూర్తులకు కూడా అండర్ ట్రయల్ ఖైదీల విడుదలను వేగవంతం చేయాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

Delhi New Liquor Policy: ఢిల్లీలో మ‌ళ్లీ పాత లిక్క‌ర్ విధాన‌మే.. కొత్త విధానంపై ర‌గ‌డ‌..!

ఈ స‌భ‌ను ఉద్దేశించి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్ వీ ర‌మ‌ణ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రతి పౌరుడికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేస్తున్నప్పటికీ, ఈ రోజు మన జనాభాలో కొద్ది శాతం మాత్రమే న్యాయ బట్వాడా వ్యవస్థను సంప్రదించగలుగుతున్నారని అన్నారు. మెజారిటీ ప్రజలు నిశ్శబ్దంతో బాధపడుతున్నారని తెలిపారు. “ సమాజంలోని అసమానతలను తొలగించే లక్ష్యంతో ఆధునిక భారతదేశం నిర్మించబడింది. ప్రాజెక్ట్ ప్రజాస్వామ్యం అంటే అందరి భాగస్వామ్యానికి ఒక స్థలాన్ని అందించడం. సామాజిక విముక్తి లేకుండా భాగస్వామ్యం సాధ్యం కాదు. న్యాయం పొందడం సామాజిక విముక్తికి ఒక సాధనం” అని ఆయన అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios