Asianet News TeluguAsianet News Telugu

గుజరాతీలు, రాజస్థానీలను పంపిస్తే ముంబై ఆర్థిక రాజ‌ధానిగా ఉండ‌దు - మహారాష్ట్ర గవర్నర్.. మండిప‌డ్డ విప‌క్షాలు

ముంబాయి నుంచి గుజరాతీ, రాజస్థానీ ప్రజలను పంపిస్తే సిటీ దేశ ఆర్థిక రాజధానిగా ఉండదు అని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దీనిపై కాంగ్రెస్, శివసేన నాయకులు మండిపడ్డారు. 

Mumbai will not be the financial capital if Gujaratis and Rajasthanis are sent - Maharashtra Governor
Author
Mumbai, First Published Jul 30, 2022, 1:48 PM IST

గుజరాతీలు, రాజస్థానీలను నగరం నుంచి పంపిస్తే ముంబైలో డ‌బ్బు మిగ‌ల‌ద‌ని, దేశ ఆర్థిక రాజ‌ధానిగా ఉండ‌బోద‌ని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ శనివారం అన్నారు. గవర్నర్ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించి, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజ‌రైన కోష్యారీ మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర నుంచి గుజరాతీలు, రాజస్థానీలను తరిమేస్తే మీ దగ్గర డబ్బు ఉండదని, ముంబై ఆర్థిక రాజధానిగా మారదని నేను ఇక్కడి ప్రజలకు చెబుతున్నాను.’’ అని అన్నారు. 

Delhi New Liquor Policy: ఢిల్లీలో మ‌ళ్లీ పాత లిక్క‌ర్ విధాన‌మే.. కొత్త విధానంపై ర‌గ‌డ‌..!

ముంబైలోని పశ్చిమ శివారు అంధేరిలో చౌక్‌కు నామకరణం చేసిన అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ముంబాయిని దేశ ఆర్థిక రాజధానిగా మార్చడంలో రాజస్థానీ-మార్వాడీ, గుజరాతీ కమ్యూనిటీల సహకారం ఉంద‌ని కొనియాడారు. రాజస్థానీ-మార్వాడీలు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు నేపాల్, మారిషస్ వంటి దేశాల్లో నివసిస్తున్నారని గవర్నర్ చెప్పారు. ‘‘ ఈ సంఘంలోని సభ్యులు ఎక్కడికి వెళ్లినా అక్క‌డ వ్యాపారం చేయ‌డ‌మే కాకుండా పాఠశాలలు, ఆసుపత్రులు సృష్టించి దాతృత్వ కార్య‌క్ర‌మాలు కూడా చేస్తారు’’ అని ఆయన అన్నారు. 

గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. గవర్నర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అతుల్ లోంధే గ‌వ‌ర్న‌ర్ పై విమ‌ర్శ‌లు చేశారు. మహారాష్ట్ర ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని అన్నారు.

Karvy Scam: రూ. 110 కోట్ల ఆస్తులు అటాచ్ చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. 

ఈ వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన సీనియ‌ర్ నాయ‌కుడు, రాజ్య‌స‌భ స‌భ్యుడు సంజయ్ రౌత్ కూడా ట్విట్ట‌ర్ వేధికగా స్పందించారు. “ మహారాష్ట్రలో బీజేపీ ముఖ్యమంత్రిని స్పాన్సర్ చేసిన వెంటనే మరాఠీ ప్రజలను అవమానించడం ప్రారంభమైంది” అని అంటూనే సీఎం షిండేను ఉద్దేశించి “కనీసం గవర్నర్ వ్యాఖ్య‌ల‌ను ఖండించండి” అని అని అన్నారు. “ ముఖ్యమంత్రి షిండే, మీరు వింటున్నారా? మీ మహారాష్ట్ర వేరు అని. మీకు కాస్త ఆత్మగౌరవం ఉంటే గవర్నర్‌ను ఆయ‌న‌ను రాజీనామా చేయమని అడగండి ’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.  ‘‘ ఇది కష్టపడి పని చేసే మారాఠీలను అవమానించడమే..మరాఠీలు మేలుకోవాలి ’’ అని గవర్నర్ ప్రసంగంలోని చిన్న క్లిప్ ను షేర్ చేస్తూ ఆయన అన్నారు. కాగా ఈ విమ‌ర్శ‌ల‌పై గ‌వ‌ర్న‌ర్ స్పందించారు. మరాఠీ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తనకు లేదని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios