ముంబై: మహారాష్ట్రలో పోర్న్ రాకెట్ నడుపుతున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. గత వారం రోజులుగా వారిని అరెస్టు చేస్తూ వచ్చారు. అరెస్టయిన 8 మందిలో ఓ సినీ నటి, ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్, విదేశీ ప్రొడక్షన్ కంెపనీ ఉద్యోగి ఉన్నారు. 

కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కాలంలో పోర్న్ చిత్రాలకు డిమాండ్ పెరిగిందని, దాంతో లాభపడే ఉద్దేశంతో ముంబైలోనూ, ముంబై చుట్టుపక్కల పలు అడల్ట్ ఫిల్మ్స్ తీశారని పోలీసులు చెప్పారు. 

నటి గెహానా విశిష్ట్ ప్రొడక్షన్ హౌస్ ను ప్రారంభించి, లఘు చిత్రాలు తీస్తున్నానని చెబుతూ పోర్న్ క్లిప్స్ నిర్మించిందని అన్నారు. సోమవారంనాడు పోలీసులు ఉమే,్ కామత్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతను ఓటీటీ వేదికపై పోర్న్ క్లిప్స్ అప్ లోడ్ చేయడానికి విదేశీ ప్రొడక్షన్ కంపెనీతో సమన్వయం చేసే పని చేస్తూ వచ్చాడని పోలీసులు చెప్పారు. 

ముంబైలో పోర్న్ చిత్రాలను నిర్మించినప్పటికీ గుర్తించకుండా ఉండడానికి విదేశాల్లో ఉన్న సర్వర్ల ద్వారా అప్ లోడ్ చేస్తూ వచ్చారని పోలీసుుల చెప్పారు.