Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. 13 ఏళ్ల బాలిక‌పై నాలుగు రోజుల పాటు 6 గురు గ్యాంగ్ రేప్.. బీహార్ లో ఘ‌ట‌న

ఓ మైనర్ ను నాలుగు రోజుల పాటు 6 గురు వ్యక్తులు దారుణంగా అత్యాచారం చేశారు. ఆమె అనారోగ్యానికి గురి కావడంతో ఓ రైల్వే స్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయారు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. 

A 13-year-old girl was gang-raped by 6 people for four days.. Incident in Bihar
Author
First Published Aug 22, 2022, 3:33 PM IST

బీహార్ లో దారుణం జ‌రిగింది. 13 ఏళ్ల మైనర్ బాలికను నలుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, ఆపై నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. అనంత‌రం ఆమెను బక్సర్ జిల్లాలోని డుమ్రాన్ రైల్వే స్టేషన్‌లో ఆమెను వ‌దిలిపెట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ప్ర‌మేయం ఉన్న శివమ్ సింగ్, సచిన్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన నలుగురు నిందితులను గుర్తించి, వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఆగస్టు 16వ తేదీన బక్సర్ జిల్లాలోని మురార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలోని తన ఇంటి నుంచి ప‌లు వ‌స్తువులు కొనుగోలు చేసేందుకు బాధితురాలు బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆమెను న‌లుగురు వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. అనంత‌రం ఆమెను ఓ అద్దె ఇంట్లోకి తీసుకెళ్లారు. ఆ ఇంట్లో ఉంటున్న మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తుల‌తో క‌లిసి వారు ఆమెపై నాలుగు రోజుల పాటు సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. 

స్కూల్ పిల్లలతో వెళ్తున్న వ్యాన్‌ను ఢీకొట్టిన ట్రక్కు.. నలుగురు విద్యార్థుల మృతి, 11 మందికి గాయాలు

ఇదే స‌మ‌యంలో బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె త‌ల్లిదండ్రులు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. అయినా ఆమె జాడ తెలియ‌రాలేదు. దీంతో వారు ఆగస్ట్ 19వ తేదీన మురార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు ప్రారంభించారు. 

అయితే మైన‌ర్ పై ప‌దే ప‌దే అత్యాచారం జ‌ర‌గ‌డంతో ఆమె ఆరోగ్యం క్షీణించింది. దీంతో నిందితులు బాధితురాలిని ఓ ప్రైవేట్ వాహనంలో తీసుకెళ్లి బక్సర్ జిల్లాలోని డుమ్రాన్ రైల్వే స్టేషన్‌లో దించారు. త‌రువాత అక్క‌డి నుంచి పారిపోయారు. అక్క‌డి నుంచి బాధితురాలు ఎలాగోలా ఆగస్ట్ 20వ తేదీ రాత్రి తన ఇంటికి చేరుకుంది. త‌న‌పై జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులకు వివ‌రించింది. వెంట‌నే త‌ల్లిదండ్రులు ఆమెను పోలీసు స్టేష‌న్ కు తీసుకెళ్లారు. 

ఈ ఘ‌ట‌న‌లో బక్సర్ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మిగిలిన నలుగురి కోసం గాలిస్తున్నారు. “మేము శివమ్ సింగ్, సచిన్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశాం. తాజాగా ఇతర నిందితులను కూడా గుర్తించాం. త్వరలో వారిని పట్టుకునేందుకు దాడులు నిర్వహిస్తున్నాం ’’ అని మురార్ పోలీస్ స్టేషన్ విచారణ అధికారి ఆర్ఎస్ యాదవ్ తెలిపారు.

గుజ‌రాత్ లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌ధానికి రాహుల్ గాంధీ సూటి ప్ర‌శ్న‌లు.. అవి ఏంటంటే ?

6 రోజుల కిందట ముంబాయిలో కూడా ఓ మైన‌ర్ పై గ్యాంగ్ జ‌రిగింది. 11 ఏళ్ల మైన‌ర్ సాయంత్రం స‌మ‌యంలో తన సెల్‌ఫోన్ రిపేర్ చేయడానికి తన ఇంటికి సమీపంలోని షాప్ కు వెళ్లింది. అయితే ఆమె ఆ స‌మ‌యంలో 21 ఏళ్ల మహిళా స్నేహితురాలిని క‌లుసుకుంది. దీంతో ఆమె ఆ మైన‌ర్ ను షికారుకు తీసుకెళ్లింది. బాలిక‌తో క‌లిసి ఓ ఏకాంత ప్ర‌దేశానికి చేరుకుంది. ఈ స‌మ‌యంలో యువ‌తి త‌న ముగ్గురు యువ‌కుల‌ను అక్క‌డికి పిలిచింది. అర్ధరాత్రి దాటాక నిందితులు ఘటనా స్థలానికి  చేరుకున్నారు. అనంత‌రం బాలికను రాబోయే గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన పండల్ వెనుక ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి బందించారు.

పామును దొరకబట్టి మెడన వేసుకుని ఊరేగాడు.. చివరకు ఆ పాము కాటుకే బలయ్యాడు..!

ఈ స‌మ‌యంలో ఆ యువ‌కుల‌తో ఒక‌రితో లైంగిక సంబంధం పెట్టుకోవాల‌ని యువ‌తి బాలిక‌ను బెదిరించింది. మైన‌ర్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో 21 ఏళ్ల యువ‌కుడు, మ‌రో వ్య‌క్తి వంతులవారీగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం అంతా యువ‌తి క‌ళ్ల ఎదుటే జ‌రిగింది. అనంత‌రం బాధితురాలిని వీరంతా క‌లిసి బుధ‌వారం తెల్ల‌వారుజామున ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్ద‌రు నిందితుల‌ను మూడు గంట‌ల్లోనే అరెస్టు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios