Asianet News TeluguAsianet News Telugu

గుజ‌రాత్ లో డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రాపై ప్ర‌ధానికి రాహుల్ గాంధీ సూటి ప్ర‌శ్న‌లు.. అవి ఏంటంటే ?

గుజరాత్ లో పదే పదే డ్రగ్స్ పట్టుబడుతున్నాయని  కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. గాంధీ నివసించిన ఈ భూమిపై విషం చిమ్ముతుందన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు. 

 

Rahul Gandhi's direct questions to the Prime Minister on the supply of drugs in Gujarat.. What are they?
Author
First Published Aug 22, 2022, 2:31 PM IST

గుజరాత్ లో జరుగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై కాంగ్రెస్ అధినాయ‌కుడు, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొన్ని నెల‌ల క్రితం ఒక పెద్ద డ్ర‌గ్స్ సిండికేట్ ను పోలీసులు ఛేదించారు. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి 4 ప్రశ్నలు సంధించారు. 

పామును దొరకబట్టి మెడన వేసుకుని ఊరేగాడు.. చివరకు ఆ పాము కాటుకే బలయ్యాడు..!

ఈ మేర‌కు ఆయ‌న ట్విట్టర్ లో.. ‘గుజరాత్‌లో డ్రగ్స్ వ్యాపారం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్? ప్రధానమంత్రి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి ’’ అని ట్వీట్ చేశారు. ‘గుజరాత్ కు వేల కోట్ల డ్రగ్స్ చేరుతున్నాయని, గాంధీ-పటేళ్ల పుణ్యభూమిపై ఈ విషం చిమ్ముతున్నదెవరు?’ అని మొదటి ప్రశ్న అడిగారు. పదే పదే డ్రగ్స్ పట్టుబడుతున్నా ఇప్పటి వరకు పోర్టు యాజమాన్యాన్ని ఎందుకు ప్రశ్నించలేదు’ అని ప్రధానికి రాహుల్ గాంధీ మరో ప్రశ్న వేశారు.

‘‘ గుజరాత్‌లో డ్రగ్ కార్టెళ్లను నడుపుతున్న నార్కోస్‌ను ఎన్‌సీబీ, ఇతర ప్రభుత్వ సంస్థలు ఎందుకు పట్టుకోలేకపోతున్నాయి? ’’ అంటూ కొలంబియాలోని డ్రగ్ కార్టెల్స్‌పై నెట్‌ఫ్లిక్స్ సిరీస్ ‘నార్కోస్’ను ప్రస్తావిస్తూ గాంధీ మరో ప్రశ్న సంధించారు. కేంద్ర ప్రభుత్వంలో, గుజరాత్‌లో మాఫియా ‘స్నేహితులకు’ రక్షణ కల్పిస్తున్న వ్యక్తులు ఎవరు అని ఆయన చివరి ప్రశ్న అడిగారు. 

ఈ విషయంలో ఎంతకాలం మౌనంగా ఉంటారని ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘ మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీరు ఎంతకాలం మౌనంగా ఉంటారు. సమాధానాలు ఇవ్వాలి’’ అని రాహుల్ గాంధీ అన్నారు. 

ప్రభుత్వం కంటే పార్టీ పెద్దది - యూపీ డిప్యూటీ సీఎం కేశ‌వ్ ప్ర‌సాద్ మౌర్య

కాగా గతంలో ముంబైలోని నార్కోటిక్స్ సెల్‌కు చెందిన వర్లీ యూనిట్ గుజరాత్‌లోని అంక్లేశ్వర్‌లో డ్రగ్ ఫ్యాక్టరీని ఛేదించింది. ఈ దాడిలో 513 కిలోల ఎండీ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఎండీ డ్రగ్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో 1026 కోట్లుగా పేర్కొంది. అదే ఏడాది మాంద్రా బంగార్‌గాలో 500 కోట్ల విలువైన 52 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

ఆప్ ను వ‌దిలేసి బీజేపీలో చేరితే సీబీఐ, ఈడీ కేసుల‌ను ఎత్తేస్తామ‌న్నారు - మ‌నీష్ సిసోడియా

ఇదిలా ఉండ‌గా రాహుల్ గాంధీకి గుజరాత్ అత్యంత కీలకమైన రాష్ట్రం. సహజంగానే గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం. ఆయ‌న ఆ రాష్ట్రానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం ఉంది. అయితే అక్క‌డ త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ గుజరాత్ సమస్యలను లేవనెత్తుతున్నారు. ఈ సారి గుజ‌రాత్ లో కాంగ్రెస్ గెలిపించాల‌ని ఆయ‌న తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios