Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటకలో వ్యభిచారం చేస్తున్న 26మంది ఆఫ్రికన్ మహిళలు అరెస్ట్... అర్థరాత్రి డ్రగ్స్, మందు మత్తులో వీరంగం....

కర్ణాటకలో నేర కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. దీంతో నగరంలో చేసిన రైడ్స్ లో 26మంది ఆఫ్రికన్ మహిళలను అరెస్ట్ చేశారు. 

26 African women arrested for prostitution in Karnataka - bsb
Author
First Published Jun 19, 2023, 12:07 PM IST

కర్ణాటక : కర్ణాటకలోని బెంగళూరులో 26 మందికి పైగా ఆఫ్రికన్లను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం బెంగళూరులోని ఎంజీ రోడ్డు, బ్రిగేడు రోడ్లలో ఉన్న బార్లు, పబ్బులపై కేంద్ర విభాగ పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో 26 మందికిపైగా ఆఫ్రికన్లు అనైతిక కార్యక్రమాల్లో పట్టుబడ్డారు. వీరందరినీ పోలీసులు అరెస్టు చేశారు.  కర్ణాటక డిసిపి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో నగరంలో భారీగా పోలీసులు సోదాలు నిర్వహించారు.  

కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలతో నగరంలో జరుగుతున్న నేర కార్యక్రమాలపై ఉక్కు పాదం మోపాలని బార్లు, పబ్బుల మీద దాడులు నిర్వహించారు. ఈ దాడులు, సోదాల్లో డ్రగ్స్ తో పాటు అనేక ఇతర అనైతిక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న ఆఫ్రికన్లను పోలీసులు ఈ నేపథ్యంలో అదుపులోకి తీసుకున్నారు. మహిళలు, పురుషులతో కలిపి 25 మందికి పైగా ఆఫ్రికన్లను.. పోలీసులు.. డ్రగ్స్ పరీక్షలకు పంపించారు. ఈ పరీక్షల్లో వీరంతా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తెలిసింది. 

చెన్నై స‌హా త‌మిళ‌నాడులోని ప‌లు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం.. స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టించిన స‌ర్కారు

పోలీసుల దాడి సమయంలో ఆ ప్రదేశంలో హైడ్రామా జరిగింది. పోలీసులను చూడగానే అరెస్టు చేయడానికి వచ్చారని అర్థమైన ఆఫ్రికన్ మహిళలు అక్కడి నుంచి పరుగులు తీశారు. వారి వెంట ఒక యువకుడు కూడా పరారయ్యాడు. అయితే, ఇది గమనించిన పోలీసులు ఆ యువకుడిని వెంటాడు పట్టుకున్నారు. ఇక మరి కొంతమంది యువతులు అయితే  మద్యంమత్తులో పోలీసులతో గొడవకు దిగారు.

రోడ్డు మీదే రచ్చ రచ్చ చేశారు.. దీంతో వీరందరిని  పోలీసులు బౌరింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వారికి వైద్య పరీక్షల నిర్వహించారు.  ఆఫ్రికన్లు, ఇతర విదేశీయులు డ్రగ్స్ తీసుకున్నట్లుగా వైద్య పరీక్షల్లో రుజువైంది.  దీంతో, ఈ కేసు మీద పోలీసులు విచారణ చేపట్టారు. ఇక అరెస్టు చేసిన ఆఫ్రికన్లను కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.  

వారికి సంబంధించిన ఫోన్ చేసి.. అరెస్ట్ అయిన ఆఫ్రికన్ల పాస్పోర్టు,  వీసా తీసుకురావాలని తెలిపారు. అయితే, వీటిని ఎవరూ తీసుకురాకపోవడంతో అరెస్ట్ అయిన అనేక మందిపై డ్రగ్స్ కేస్ తో పాటు అక్రమ వలస కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు.  పోలీసులు సోదాల్లో వీరి వద్ద డ్రగ్ దొరకలేదు.. కానీ వీరికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి?  అనే దానిమీద పోలీసుల విచారణ చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios