Infertility: పురుషుల్లో సంతానలేమికి తల్లే కారణమా? తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు
CCMB: చాలామంది దంపతులు మనకు ఎన్ని సంవత్సరాలు గడిచినా తమకు పిల్లలు లేరని ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే సంతాన లేమికి తమ కోడలే కారణమని నిందించే అత్తలు కూడా ఉన్నారు. ఇప్పుడూ అలా నిందించే రోజులు పోయాయి. ఇటీవల వెలువడిన CCMB అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
CCMB: చాలామంది దంపతులు మనకు ఎన్ని సంవత్సరాలు గడిచినా తమకు పిల్లలు లేరని ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే కొంతమంది సంతానలేమికి తమ కోడలే కారణమని నిందించే అత్తలు కూడా ఉన్నారు. ఇప్పుడూ అలా నిందించే రోజులు పోయాయి. సంతానలేమికి అబ్బాయిలోనూ లోపం ఉండొచ్చుననీ, పిల్లలు కాకపోవడానికి అది కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు.
ఇటీవల సీసీఎంబీ వెలువడిన ఓ అధ్యయనంలో సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. తల్లి నుంచి సంక్రమించే లోపభూయిష్ట జన్యువు కూడా పురుషుల సంతానలేమికి కారణం అని సీసీఎమ్‌బీ అధ్యయనంలో మొదటిసారిగా తెలిసింది. ఈ జన్యువు ఎక్స్ క్రోమోజోమ్‌లో ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధనల్లో ఇతర పరిశోధన సంస్థలకు చెందిన పరిశోధకులతో పాటు హైదరాబాద్‌లోని సీసీఎమ్‌బీకి చెందిన పరిశోధకులు పాల్గొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం హైదరాబాద్ సీసీఎమ్‌బీ వెల్లడించింది.
సీసీఎమ్‌బీ పరిశోధకులు మాట్లాడుతూ ప్రపంచంలో ఉన్న ప్రతి ఏడు జంటల్లో ఒక జంట సంతానలేమి సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపారు. పురుషులకు వారి తల్లి నుంచి సంక్రమించే జన్యులోపమే ఇందుకు కారణం అని తెలిపారు. పురుషుల్లో శుక్రకణాల సైజు, నిర్మాణం కదలికల్లో లోపాలు, శుక్రకణాల సంఖ్య తగ్గటమే ఇందుకు కారణంగా తెలిపారు.సంతానం లేకుండా బాధపడుతున్న పురుషులు, అలాగే ఆరోగ్యంగా ఉన్న పురుషుల జన్యువులను కొత్త జన్యుక్రమ విశ్లేషణ పద్ధతిలో శాస్త్రవేత్తలు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో ఎక్స్ క్రోమోజోమ్‌లో టీఈఎక్స్13బీ అనే లోపభూయిష్ట జన్యువే పురుషుల్లో సంతానలేమికి కారణం అని గుర్తించారు. దాంతో పాటుగానే మరొ రకమైన జన్యువు కూడా సంతానలేమితో బాధపడుతున్నవారిలో అధికంగా ఉన్నట్టు తెలిపారు.