EPF New Rule: పీఎఫ్ విత్‌డ్రా చేస్తున్నారా? ఇకపై దాని అవసరం లేకుండానే డబ్బులు.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ ఇవే..

EPF New Rule: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ (EPF) ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఉద్యోగం మానేసిన సమయంలో లేదా రిటైర్మెంట్ సమయంలో పీఎఫ్ డబ్బుల్ని మొత్తం తీసుకోవచ్చు. అయితే.. గతంలో ఉన్న కఠినతరమైన రూల్స్ ను బ్రేక్ చేస్తూ.. ఈపీఎఫ్ఓ కొత్త రూల్స్ తీసుకవచ్చింది. ఇవే ఈపీఎఫ్ కొత్త రూల్స్ (EPF New Rule) ఇవే

New Rule For Epf Death Claim Now Physical Claims Can Be Processed Without Seeding Aadhaar KRJ

PF Withdrawal New Rule: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ పీఎఫ్ అకౌంట్ (EPF) ఉంటుందన్న సంగతి తెలిసిందే. అదే ప్రభుత్వ ఉద్యోగులకైతే.. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) వర్తిస్తుంది. తాజాగా ఈపీఎఫ్  తీసుకునే ఉద్యోగుల కోసం సరికొత్త రూల్ అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు ఆయా సంస్థలు పీఎఫ్ కొత్త రూల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగి పేరు మీద ఓ ఖాతాను తెలిచి వారి జీతం నుంచి కొంత డబ్బును జమచేస్తారు. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ను పీఎఫ్ ఖాతాదారుడికి ఇస్తారు. 

ఇదిలా ఉంటే కొన్నిసార్లు పీఎఫ్ డబ్బులు డ్రా చేసుకునేందుకు కొన్ని ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. పీఎఫ్ విత్ డ్రా చేసుకోవడానికి కొత్త రూల్స్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఈ కొత్తరూల్ ద్వారా పీఎఫ్ అమౌంట్ ను ఆధార్ కార్డ్ లేకపోయినా విత్ డ్రా చేసుకోవచ్చు. తన సబ్ స్క్రైబర్ల కోసం (ఈపీఎఫ్ఓ) ఉద్యోగ భవిష్య నిధి సంస్థ  ఈ నిర్ణయం తీసుకుంది. 

పీఎఫ్ ఖాతాదారులకు సులభంగా సేవలందించేందుకు ఈ రూల్ అమలు చేస్తుంది. ఈ కొత్త రూల్ ద్వారా బతికున్న వారి పీఎఫ్ డబ్బులు మాత్రమే కాకుండా మృతిచెందిన ఖాతాదారుల డబ్బును కూడా ఈసీగా విత్ డ్రా చేసుకోవచ్చు. అయితే కొత్త రూల్ అమలు కాక ముందు మృతిచెందిన వారి ఖాతా నుంచి డబ్బును డ్రా చేసేందుకు ఆధార్ కార్డు మాత్రం కచ్చితంగా ఉండాల్సి ఉండేది.

కానీ ప్రస్తుతం కొత్త రూల్ ద్వారా ఖాతాదారుడు మరణిస్తే ఆధార్ కార్డు ఇవ్వాల్సిన అవసరం లేకుండా వారి కుటుంబ సభ్యులు పీఎఫ్ డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. దీని కన్నా ముందు మృతిచెందిన ఉద్యోగి ఏ సంస్థలో పని చేస్తున్నారో ఆ సంస్ధకు చెందిన హెచ్ఆర్ విభాగం ఉద్యోగి మరణాన్ని ధృవీకరిస్తూ ఈపీఎఫ్ఓ వెబ్ సైట్లో తెలియపరచాలి. ఆ వివరాలను చెక్ చేశాక ఈపీఎఫ్ఓ అధికారులు, ఆఫీసర్ ఇన్‌చార్జీ (ఓఐసీ) అనుమతితో మరణించిన వ్యక్తి పీఎఫ్ విత్ డ్రా ప్రక్రియ మొదలవుతుంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios