Asianet News TeluguAsianet News Telugu

మిజోరంలో రూ. 60 లక్షల విలువైన డ్రగ్ పట్టివేత.. ఇద్దరు మహిళలు అరెస్ట్..

మిజోరంలో ఐజ్వాల్ నగరం నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.60 లక్షల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు మయన్మార్‌కు చెందినవారు. ఈ వ్యవహారంపై విచారణ సాగుతోంది.

2 Women Arrested With Drugs Worth Rs 60 Lakh In Mizoram
Author
First Published Mar 22, 2023, 5:31 AM IST

మిజోరంలోని ఐజ్వాల్ లో  డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.60 లక్షల విలువైన హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఒకరు మయన్మార్‌కు చెందినవారు. ఈ వ్యవహారంపై విచారణ సాగుతోంది. వివరాల్లోకెళ్తే.. నిర్దిష్ట సమాచారం ఆధారంగా సోమవారం సతీక్ ప్రాంతంలోని ఐజ్వాల్‌లోని స్పెషల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ CID (క్రైమ్), అస్సాం రైఫిల్స్ లు సంయుక్త ఆపరేషన్ నిర్వహించింది.

ఈ ఆపరేషన్ సమయంలో ₹ 60 లక్షల విలువైన తొమ్మిది సబ్బు పెట్టెలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు మహిళల్లో ఒకరు మయన్మార్ చెందిన వార అస్సాం రైఫిల్స్ తెలిపింది. రికవరీ చేయబడిన సరుకు , పట్టుబడిన వ్యక్తులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం స్పెషల్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ CID (క్రైమ్), ఐజ్వాల్‌కు అప్పగించారు. విచారణ జరుగుతోంది.


అస్సాం మిజోరంలో డ్రగ్స్ కలకలం..

మిజోరం రాష్ట్ర సరిహద్దు సమీపంలోని కరీంగంజ్ జిల్లాలో అస్సాం పోలీసులు 1300 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఓ వాహనంలో డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వాహనం మిజోరం నుంచి వస్తుండగా కొంటెచెర సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో మిజోరం నుంచి వస్తున్న కారులో డ్రగ్స్‌ తీసుకెళ్తున్నట్లు మాకు పక్కా సమాచారం అందిందని కరీంగంజ్ పోలీసు సూపరింటెండెంట్ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు. దీంతో పర్యవేక్షించడానికి నాకాను నియమించామని తెలిపారు. వాహనాల తనిఖీ చేయగా.. ఓ  వాహనంలో దాచిన కంపార్ట్‌మెంట్లలో 1.3 కిలోల బరువున్న 100 (డ్రగ్స్) సబ్బు కంటైనర్‌లు కనిపించాయి. వాహనం మిజోరంలోని చంపాయ్ గ్రామం నుంచి వస్తున్నట్లు నిర్ధారించారు. ఈ కేసులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. అనే కోణంలో తదుపరి విచారణ కొనసాగుతోంది.

గుజరాత్‌లో డ్రగ్స్ స్వాధీనం

శనివారం గుజరాత్‌లోని ద్వారక ఓఖా తీరానికి 185 నాటికల్ మైళ్ల దూరంలో అరేబియా సముద్రం నుంచి 61 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.427 కోట్లు. డ్రగ్ స్మగ్లర్లపై ఈ చర్య ఇండియన్ కోస్ట్ గార్డ్ , ATS బృందం సంయుక్త ఆపరేషన్‌తో జరిగింది. ఈ కేసులో ఐదుగురు ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు . వారి విచారణ కొనసాగుతోంది. ఈ డ్రగ్స్‌ గుజరాత్‌లోని సబర్‌కాంత వద్దకు చేరుకోనున్నాయని, ఇక్కడి నుంచి ఉత్తర భారతదేశంలోని నగరాలకు సరఫరా చేసేందుకు ప్లాన్‌ వేసినట్లు ఏటీఎస్‌ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios