Asianet News TeluguAsianet News Telugu

ముగ్గురు పిల్లల తండ్రి...మైనర్ ను గదిలో బంధించి, ఫ్రెండ్ తో కలిసి 7 రోజులపాటు రేప్

అక్టోబర్ 1న ఆ అమ్మాయిని ఇంటి బయటకు పిలిచాడు. అనంతరం ఆమెను బైక్ పై 200 కిలోమీటర్ల దూరం ఉన్న Jodhpur కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడకు తన Friendని పిలిపించుకున్నాడు. ఆ తరువాత స్నేహితుడితో కలిసి... 17 యేళ్ల అమ్మాయిని ఓ గదిలో బంధించి, ఏడు రోజులపాటు rapeకి పాల్పడ్డాడు. 

17-year-old minor was taken and held hostage for seven days and gang-raped with a friend in Rajasthan
Author
Hyderabad, First Published Oct 26, 2021, 10:41 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

అతడు ముగ్గురు పిల్లల తండ్రి, అర్థరాత్రి సమయంలో పదిహేడేళ్ల అమ్మాయిని ఇంటినుంచి బయటకు పిలిచి, బైక్ మీద 200 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాడు. ఆ తరువాత స్నేహితుడికి సమాచారం అందించాడు. 

ఈ క్రమంలో అక్కడకు చేరుకున్న స్నేహితుడితో అతడు దారుణానికి పాల్పడ్డాడు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి విరాల్లోకి వెడితే...రాజస్థాన్ కు చెందిన తేజ్ రామ్ అనే వ్యక్తికి కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లైంది. 

ఈ క్రమంలో అతడికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు. ముగ్గురు పిల్లలకు తండ్రైనా అతడు నీచంగానే ఆలోచించాడు. స్థానికంగా ఉన్న ఓ 17 యేళ్ల అమ్మాయిపై కన్నేశాడు. మాయమాటలు చెప్పి, ఆమెను loveలోకి దించాడు. 

ఈ క్రమంలోనే అక్టోబర్ 1న ఆ అమ్మాయిని ఇంటి బయటకు పిలిచాడు. అనంతరం ఆమెను బైక్ పై 200 కిలోమీటర్ల దూరం ఉన్న Jodhpur కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే అక్కడకు తన Friendని పిలిపించుకున్నాడు. ఆ తరువాత స్నేహితుడితో కలిసి... 17 యేళ్ల అమ్మాయిని ఓ గదిలో బంధించి, ఏడు రోజులపాటు rapeకి పాల్పడ్డాడు. 

కాగా, అక్టోబర్ 12న రాత్రి నుంచి కూతురు కనబడకుండా పోవడంతో మరుసటి రోజు సదరు అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి ఆచూకీ తెలుసుకోవడం కోసం దర్యాప్తు ప్రారంభించారు. 

ఈ నేపథ్యంలోనే తేజ్ రామ్ చేసిన దారుణం బయటపడింది. దీంతో తేజ్ రామ్, అతడి స్నేహితుడిమీద కేసు నమోదు చేసిన అధికారులు వారిని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. అంతేకాకుండా సదరు అమ్మాయిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. 

ఉత్తర ప్రదేశ్ లో మరో దారుణం
ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్ లో వర్ధమాన మోడల్ కు మత్తు మందు ఇచ్చిన ఓ మహిళ ఆమెను నగ్నంగా చేసి ఫోటోలు, వీడియోలు తీసి ఆపై వాటిని  చూపించి బ్లాక్ మెయిల్ కు దిగిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. రూ.5 లక్షలు ఇస్తే వాటిని డిలీట్ చేస్తామని లేదంటే ఇంటర్నెట్లో పెడతానని బెదిరింపులకు దిగింది.

విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. మోడల్ ను Screen testకు  పిలిచి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసిన Victim  ఐదు లక్షలు ఇవ్వకుంటే ఫొటోలు, వీడియోలను Social mediaలో అప్లోడ్ చేస్తానని బెదిరించినట్లు ఆరోపించింది.

వైష్ణవి ఫిల్మ్ ప్రొడక్షన్స్ తో పాటు పలు  సినిమాలు, modeling అవకాశాలు ఇప్పిస్తానంటూ దియా వర్మ అనే మహిళ బాధితురాలిని కలిసింది.  తన మాయ మాటలు నమ్మిన  బాధితురాలిని తీసుకు వెళ్లిన దియా..  అనూప్ ఓఝా, వరుణ్ తివారి,  ఆయుష్ మిశ్రా,  ప్రియా మిశ్రా,  సందీప్ విశ్వకర్మ లను తన సహచరులుగా చెబుతూ పరిచయం చేసింది. 

ఆ తరువాత స్క్రీన్ టెస్ట్ కు రావాలి అంటూ ఆమెను guesthouseకు పిలిపించారు. అక్కడ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చారు.  ఆ తర్వాత ఓ డ్రెస్ ఇచ్చి Changing room కి వెళ్లి మార్చుకోవాలని చెప్పారు.  దియాను ఆమె ఫ్రెండ్స్ ను అమాయకంగా నమ్మిన ఆ మోడల్ కు వారిమీద ఏ కాస్త అనుమానం కూడా రాలేదు. దీంతో డ్రెస్ మార్చుకోవడానికి వారు చెప్పిన గదిలోకి వెళ్లింది. అప్పటికే కూల్ డ్రింక్ లోని మత్తు తలకు మెల్లిమెల్లిగా ఎక్కుతుండడంతో.. అసలేం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితుల్లో పడిపోయింది.

Follow Us:
Download App:
  • android
  • ios