ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ యువతిపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడగా, ఈ తతంగాన్ని వీడియో తీసిన అతని డ్రైవర్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగడంతో బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడింది.

వివరాల్లోకి వెళితే... సహరాన్‌పూర్‌కి చెందిన  17 ఏళ్ల యువతిపై నోమన్ అనే వ్యక్తి కన్నేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు. అయితే తన యజమాని యువతిని రేప్ చేస్తున్న దృశ్యాలను అతని వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్న రహ్‌బర్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.

అనంతరం ఆ వీడియోలను చూపి యువతిని బ్లాక్‌మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అతను అడిగినంత డబ్బులు ఇవ్వలేకపోవడంతో రేప్ వీడియోలను లీక్ చేశాడు. తన నగ్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బాధితురాలు మనస్తాపానికి గురైంది.

అవమాన భారం తట్టుకోలేక విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గమనించిన కుటుంబసభ్యులు బాధితురాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు నిందితులు నోమన్, అతని డ్రైవర్ రహ్‌బర్‌ని అరెస్ట్ చేశారు.