ఓ మైనర్ బాలికపై కొందరు మృగాళ్లు దారుణానికి పాల్పడ్డారు. 14 ఏళ్ల చిన్నారి బాలిక తలకు తుపాకీ గురిపెట్టి బెదిరించి అత్యంత పైశాచికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఉత్తర ప్రదేశ్ లో చోటుచేసుకుంది. 

 ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ముజఫర్ నగర్ కు చెందిన బాలిక ఇంటి అవసరాల కోసం దగ్గర్లోని చేతి పంపు నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండడాన్ని గమనించిన దుండగులు ఈ చేతిపంపు వద్దనుండి తుపాకీతో బెదిరించి దగ్గర్లోని ఓ ఇంట్లోకి లాక్కెల్లారు. ముగ్గురు యువకులు ఆమెపై తుపాకీ గురిపెట్టి దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.  బాలికను రేప్ చేస్తూ వీడియో కూడా తీశారు.

ఇలా లైంగిక దాడికి పాల్పడిన విషయం ఎవరికైనా చెబితే వీడియోను అందరికి చూపిస్తామంటూ బెదిరించారు. ఈ బెదిరింపులకు భయపడని బాలిక జరిగిన దారుణం గురించి తండ్రికి చెప్పింది. దీంతో బాలిక తన కూతురితో కలిసి స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ముగ్గురు నిందితులపై ఫిర్యాదు చేశాడు.

ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.  నిందితులపై పోస్కో చట్టం కింద అభియోగాలు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.