దాసోజు కృష్ణమాచారి తెలుగు కవిత: కరోనా వస్తుంది
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విస్తరిస్తున్న క్రమంలో తెలుగు కవులు తమ కవితల ద్వారా సమరం సాగిస్తున్నారు. దాసోజు కృష్ణమాచారి కోవిడ్ -19పై సమరం చేయాల్సిన అవసరాన్ని చెబుతూ కవిత రాశారు.
కరోనా వస్తుంది
ఎ ఇంటికి వస్తుందో
ఎ మనిషికి వస్తందో
గాలి గాలిగా దేశ దేశాలు
తిరిగి తిరిగి
ధూలితో పాటు క్రిమిని యంట పెట్టుకోని
తాళ్ళ పెనుకోని ఇద్దరు కలిసి
మన దేశంల తిర్గుతుండ్రు
కరోనా కనిపించదు,వినిపించదు
బైటి దేశంల కేల్లి వచ్చినోళ్ళ
తుమ్మల,దగ్గలల్లో కలిసి వచ్చింది
గాళ్ళను యర్కపట్టి
డాక్టర్లుకు అప్పజేపాలే
వాళ్ళకు దోర్కకుంటా
మనం ఇంట్ల కేల్లి బయటకు రావద్దు
చేతులు సుబ్బరంగ సబ్బుతో కడగాలి
మనం మనల్ని కాపాడుకోని
మన చుట్టూ ఉన్నవాళ్ళను
మన ప్రజలను
మన దేశాన్ని కాపాడుకుందాం
లాక్ డౌనుకు సహకరిద్దాం!!
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature