దేశం మట్టి మనిషి వేరుకాదబ్బ విడిపోతే పడి పాడైపోతావు అంటూ రేడియమ్ రాసిన కవిత  ' ఆటమొదలు ' ఇక్కడ చదవండి 

దేశం మట్టి మనిషి వేరుకాదబ్బ విడిపోతే పడి పాడైపోతావు అంటూ రేడియమ్ రాసిన కవిత ' ఆటమొదలు ' ఇక్కడ చదవండి : 

చేపల చెఱువు
గొఱ్ఱెల మండి
కొంగల గుంపు
నక్కల గుంపు

దొంగ తపస్సు
ధూర్త వినయం
పాతకథలవి
కొత్త రూపంగా అవి

మళ్లి కులం పోట్లు
మళ్లి కరెన్సీ నోట్లు
మళ్ళి ఓట్ల జాతర
గద్దె కోసం తండ్లాట

బుద్ధి డబ్బు మేసిన 
బుద్ధి మత్తులో తూలిన
ఉనికి తారుమారు
అస్తిత్వం మంటపాలు

యుద్ధాలు చరిత్ర చెబుతాయి
జీవించె తీరులో నాగరికతలు
కులం తగదాలు తగ్గుతున్నాయి
మతాల జోరు అంతగా కానరావు

ఓట్ల పేరుతో ఏకతా సూత్రనికి దెబ్బ
దేశం మట్టి మనిషి వేరుకాదబ్బ
విడిపోతే పడి పాడైపోతావు
నిప్పు గాలి వానలా ఉండి పోవాలి