చాలా మంది శృంగారం, సెక్స్ లాంటి పదాలను బూతులాగా చూస్తుంటారు. ఈ అభిప్రాయం ప్రజల్లో కలగడానికి ఈ మధ్య వచ్చిన సినిమాలు కూడా ఒక కారణమే. ఈ సంగతి పక్కన పెడితే.. చాలా మందికి పగటిపూట సెక్స్ చేయకూడదు అనే అభిప్రాయం ఉంటుంది. ఎందుకు, ఏమిటీ కారణాలు లేకుండా.. పగటి పూట చేయడానికి ఆసక్తి చూపించరు. ఈ కార్యం కేవలం రాత్రికి పరిమితం చేస్తుంటారు.

అయితే...దీనిపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. పగటి పూట శృంగారంలో పాల్గొనడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. దీనిని కేవలం రాత్రికే పరిమితం చేయాల్సిన అవసరం లేదన్నారు. మొయిన్ రీజన్ ఏంటంటే... శృంగారంలో పాల్గొన్న తర్వాత శరీరం అలసిపోతుంది. క్యాలరీలు కరిగిపోతాయి. దీంతో అలసిపోయి వెంటనే నిద్రవచ్చేస్తుంది.

నిద్రరాగానే..పడుకోవానికి పగలు కుదరదు కదా. అందరికీ ఏవేవో పనులు ఉంటాయి. కాబట్టి పగటిపూట సెక్స్ వద్దు అంటారు. అదే నిద్రపోవడానికి, కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటే... హ్యాపీగా పగలు కూడా శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. సెక్స్ అంటే.. రాత్రి రతిక్రీడే అన్న ఆలోచనను మాత్రం మీ మైండ్ లో నుంచి తీసేయండి అంటున్నారు నిపుణులు.