Asianet News TeluguAsianet News Telugu

మీ గుండె స్ట్రాంగ్ గా, ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలను తీసుకోవాల్సిందే..

ప్రతిరోజూ 30 నుంచి 40 నిమిషాల పాటు వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యంగా ఉండే ఆహారాలను తింటే మీ గుండె ఆరోగ్యం, ఫిట్ గా ఉంటుంది. లేదంటేనా.. చిన్నవయసులోనే గుండెపోటు బారిన పడే అవకాశం ఉంది మరి.. 
 

Heart Health: how to keep your heart healthy
Author
First Published Sep 23, 2022, 12:14 PM IST

ఒకప్పుడు గుండె జబ్బులు మధ్యవయస్కులకు, ముసలి వాళ్లకే వచ్చేవి. అవికూడా చాలా రేర్ గా. కానీ ఇప్పుడు 25 ఏండ్ల  యువకులు కూడా గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఈ గుండె జబ్బులకు కారణాలెన్నో ఉన్నాయి. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారతదేశంలోనే గుండె జబ్బుల రేటు రెండు నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఉంది. మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో గుండె రోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని నిపుణులు చెబుతున్నారు. 

పాశ్చాత్య దేశాల్లోని ఎక్కువ మొత్తంలో 60 ఏళ్ల వయసు వారే గుండెపోటుకు గురవుతున్నారట. అయితే ఈ గుండెపోటు 50 ఏండ్ల నుంచి 40 ఏండ్ల మధ్యకాలంలో వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం,  అధిక రక్తపోటు, మధుమేహం, అధిక రక్త కొలెస్ట్రాల్, ఊబకాయం, వ్యాయామం లేకపోవడం, ఆహారంలో కూరగాయలు, పండ్లు లేకపోవడం, మితిమీరి మద్యపానం తాగడం వల్ల వంటివి కూడా గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. 

ఈ ప్రమాద కారకాలన్నింటికీ చెక్ పెట్టడానికి మన జీవనశైలిని మార్చుకుంటే దేశంలో గుండె జబ్బులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి గుండె ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదంది. 

రక్తపోటు (బీపీ)ను నియంత్రణలో ఉంచుకోవాలి. సాధారణ బిపి 120/70. 120/75 కంటే ఎక్కువ బిపిని కూడా గమనించాలి. రక్తంలో గ్లూకోజ్ 126 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. భోజనం తిన్న తర్వాత  మీ రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ 126 ఉండి.. లేదా 2 గంటల తర్వాత రక్తంలో గ్లూకోజ్ 200 కంటే ఎక్కువగా ఉన్ననట్టైతే మీకు మధుమేహం ఉందని కన్ఫామ్ చేసుకోవాలి. 

మానసిక సమస్యలు కూడా గుండెను ప్రమాదంలో పడేస్తాయి. అందుకే ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా రోజుకు 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. మిమ్మల్ని ఆనందంగా ఉంచే కర్యకలాపాల్లో పాల్గొనాలి. వీటితో పాటుగా ఊబకాయం తగ్గించుకోవాలి. ఊబకాయమే సర్వ రోగాలకు దారితీస్తుంది. భారతదేశంలో 23 కంటే ఎక్కువ బిఎమ్ఐ ఉన్న వ్యక్తులను అధిక బరువు ఉన్నవారిగా పరిగణిస్తారు.

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 30 లేదా 40 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. అలాగే బాడీ మొత్తం కదిలేలా నడవాలి. జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి ఇతర కార్యకలాపాలు కూడా మీ గుండెను  ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతాయి. ఇవి గుండెపోటు రాకుండా రక్షిస్తాయి. పండ్లు, కూరగాయలను ఎక్కువగా తినడం వల్ల కూడా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కూరగాయలు గుండె లైఫ్ టైంను పెంచుతాయి. గుండె ఆరోగ్యానికి రోజూ 600 గ్రాముల పండ్లు, కూరగాయలు తినాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు చేస్తోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios