Asianet News TeluguAsianet News Telugu

వర్క్ ప్లేసెస్‌లలో ‘బయాస్’: స్త్రీ, పురుషులపై ఎలా వుందంటే..?

స్త్రీ పురుష సమానత్వంపై మన దేశంలో ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. స్త్రీలకు ఉద్యోగాల్లో వివక్ష తగదని, వారిని కూడా మగవారితో సమానంగా చూడాలని వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, అమలు విషయంలోకి వచ్చే సరికి మాత్రం వాదనలు వాదనలుగానే మిగిలిపోతున్నాయి.

Bias In The Hiring Process In Indian Engineering Workplaces
Author
Delhi, First Published Apr 9, 2019, 4:59 PM IST

స్త్రీ పురుష సమానత్వంపై మన దేశంలో ఎప్పుడూ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. స్త్రీలకు ఉద్యోగాల్లో వివక్ష తగదని, వారిని కూడా మగవారితో సమానంగా చూడాలని వాదనలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, అమలు విషయంలోకి వచ్చే సరికి మాత్రం వాదనలు వాదనలుగానే మిగిలిపోతున్నాయి.

తాజాగా, మనదేశంలో ఇంజినీరింగ్ కార్యాలయాలతోపాటు ఇతర ఆఫీసుల్లోనూ స్త్రీలకు మగవారితో సమానంగా అవకాశాలు లభించడం లేదని, వివక్షకు గురవుతున్నారని తేలింది. సొసైటీ ఆఫ్ వుమెన్ ఇంజినీర్స్(SWE), సెంటర్ ఫర్ వర్క్ లైఫ్ లా(WLL) అనే సంస్థలు దేశంలోని 693 మంది ఇంజినీర్లను ఇంటర్వ్యూ చేయగా ఈ విషయం వెల్లడైంది.

423మంది మహిళలు, 270మంది పురుషులు ఇంటర్వ్యూలో పాల్గొనగా.. వీరిలో ఎక్కువ మంది వివక్ష(బయాస్) నిజమేనని అంగీకరించారు. ప్రమోషన్ల విషయంలో కూడా మహిళలు వివక్షకు గురవుతున్నారని తేలింది. పురుషులకు తొందరగా ప్రమోషన్స్ వస్తే.. మహిళలకు చాలా కాలం తర్వాతే లభిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఇంజినీరింగ్ కార్యాలయాల్లోనే గాక ఇతర రంగాల్లో కూడా ఈ సమస్య ఉండటం గమనార్హం. భారతదేశంలో 31శాతం మంది మహిళలు ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ డిగ్రీలు పొందగా.. వారిలో 12.7శాతం మాత్రమే వర్కింగ్ ఇంజినీర్స్‌గా ఉన్నట్లు ది హిందూ కథనం వెల్లడించింది.

50శాతం ఇంజినీర్లు తమ కంపెనీల హైరింగ్ సిస్టమ్‌‌లో వివక్షకు గురవుతున్నారు. హైరింగ్ ప్రాసెస్‌లో ఆశ్చర్యకరంగా 54శాతం పురుషులు వివక్షకు గురవుతుండటం గమనార్హం. 

45శాతం మహిళలు బయాస్‌కు గురవుతున్నారు. అమెరికాలో ఈ పరిస్థితి ఉంది. మహిళలు లింగ వివక్షకు గురవుతుండగా.. అదే సమయంలో పురుషలు రీజియన్, ఆరిజన్, వారి స్వరాష్ట్రం లాంటి విషయాల కారణంగా బయాస్‌కు గురవుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios