Asianet News TeluguAsianet News Telugu

అమెరికా సెక్స్ రాకెట్: తెలుగు సంఘాల్లో లుకలుకలు

అమెరికా సెక్స్ రాకెట్: తలలు పట్టుకొంటున్న తెలుగు అసోసియేషన్లు 

War words between telugu associations in America

హైదరాబాద్: అమెరికాలో  సినీ హీరోయిన్లు,  యాంకర్లతో  నిర్మాత మోదుగుమూడి కిషన్ సెక్స్ రాకెట్ నడిపిన విషయం వెలుగు చూడడంతో  తెలుగు సంఘాలు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకొంటున్నారు. ఎవరేవరు ఎక్కడెక్కడ ఏం చేశారనే విషయమై  సోషల్ మీడియా వేదికగా చేసుకొని  విమర్శలు చేసుకొంటున్నారు. 

అమెరికాలో  తెలుగు సంఘాలు  పలు కార్యక్రమాలకు టాప్ హీరోయిన్లు, యాంకర్లను ఆహ్వానించి కార్యక్రమాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే  ఎంత గొప్ప హీరోయిన్లు, యాంకర్లను ఆహ్వానించి కార్యక్రమాలను నిర్వహిస్తే  ఆ సంఘం ఆ కార్యక్రమం గురించి అంతే గొప్పగా ప్రచారం చేసుకొనేది. తమ కార్యక్రమం ఏ రకంగా విజయం సాధించిందనే విషయాన్ని ఆయా సంఘాల ప్రతినిధులు సోషల్ మీడియా వేదికగా  ప్రచారం చేసుకొనేవారు.

అమెరికాలో మోదుగుపూడి కిషన్ దంపతులు సినీ హీరోయిన్లతో  సెక్స్ రాకెట్ నిర్వహించిన విషయమై అమెరికా పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత  తెలుగు సంఘాలు ఒకరిపై మరోకరు విమర్శలు చేసుకొంటున్నారు. 

అయితే మోదుగుపూడి కిషన్ కేసులో  ఏయే తెలుగు సంఘాలకు లింకులున్నాయనే విషయమై కూడ  తెలుగు సంఘాలు ఆరా తీస్తున్నాయి.  అంతేకాదు  ఈ విషయమై ఒకరిపై మరో సంఘం దుమ్మెత్తిపోసుకొంటున్నాయి.

గతంలో తెలుగు అసోసియేషన్లు చేసిన కార్యక్రమాలకు సంబంధించిన విషయాలపై  తెలుగు సంఘాలు సోషల్ మీడియా వేదికపై  వాడి వేడిగా చర్చించుకొంటున్నారు. ఎవరెవరికీ ఈ విషయంలో సంబంధాలున్నాయనే విషయమై ఆరా తీస్తున్నారు. మోదుగుపూడి కిషన్ నోరు విప్పితే అసలు విషయాలు వెలుగు చూస్తాయని కొన్ని తెలుగు సంఘాలు నోరు మెదపడం లేదనే వాదన కూడ లేకపోలేదు.

టాలీవుడ్‌ హీరోయిన్లు, టీవీ యాంకర్లను తీసుకువచ్చి ప్రదర్శనలు ఇప్పించే సంస్కృతి అమెరికాలో గత ఐదారేళ్లుగా బాగా పెరిగిపోయింది. ఏదైనా సభ జరుగుతోందంటే దానిలో చర్చించే విషయాల గురించి కాకుండా ఏ హీరోయిన్‌ వస్తోంది? ఏ యాంకర్‌ వస్తోందనే విషయాన్నే తెలుగు సంఘాలు ప్రచారం చేయటం మొదలుపెట్టాయి. వేదికపై ప్రదర్శనలు పూర్తయిన తర్వాత ఆసక్తి ఉన్నవారు వచ్చి హీరోయిన్లను కలవవచ్చనే ప్రకటనలిచ్చి ప్రచారం కూడ చేస్తున్నారు.

హీరోయిన్లు, యాంకర్లతో కార్యక్రమాలను నిర్వహించేందుకు గాను  లక్షల డాలర్లను ఖర్చు చేస్తున్నారు. ఒక్క అసోసియేషన్  నిర్వహించే  కార్యక్రమం సందర్భంగా  మరో అసోసియేషన్  గురించి అతిథులకు ఆంక్షలు విధించే వారనే ప్రచారం కూడ లేకపోలేదు. 

హోంల్యాండ్‌ సెక్యూరిటీ కోర్టులో దాఖలు చేసిన చార్జీషీటులో యాంకర్‌, ఇతర నటీమణుల పేర్లు బయటపెట్టలేదు. అదే విధంగా విటుల పేర్లను ప్రస్తావించలేదు. అయితే వీరందరి పేర్లు మోదుగుమూడి జాగ్రత్త చేసిన లెడ్జర్లలో ఉన్నాయి. 

ఈ కేసులో నిందితుడు, ఆయనకు సహకరించిన వ్యక్తి కస్టడీలో ఉన్నారు. నటీమణులు అప్రూవర్లుగా మారిపోయారు. మోదుగుమూడి దంపతులు సమాచారం ఇవ్వకపోతే  ఒకవేళ వారు ఎదురు తిరిగితే సాక్ష్యం కోసం విటులను, అసోషియేషన్‌ ప్రతినిధులను సాక్ష్యం కోసం పిలిచే అవకాశముంది.అయితే ఈ కేసుకు సంబంధించి తమకు ఎలాంటి సంబంధం లేదని తానా,నాట్స్ ప్రకటించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios