Asianet News TeluguAsianet News Telugu

Antarctica: అక్కడ నాలుగు నెలల తర్వాత తెలవారుతుంది.. ఈ కాలంలో సైంటిస్టులు ఏం చేస్తారంటే?

అంటార్కిటికా ఖండంలో మే 13న అస్తమించిన సూర్యుడు మళ్లీ నాలుగు నెలల తర్వాతే ఉదయించనున్నాడు. అంటే.. అక్కడ నాలుగు నెలల కేవలం చీకటే ఉండనుంది. దీర్ఘకాలం అంతరిక్షంలో ఉండాల్సి వచ్చే వ్యోమగాములను ఈ కఠిన రోజుల్లో అంటార్కిటికా ఖండంలో శిక్షణ ఇస్తారు.
 

sun sets for 4 months in antarctica continent.. astronauts traininig happen
Author
New Delhi, First Published May 16, 2022, 6:40 PM IST

న్యూఢిల్లీ: ఔను.. అక్కడ పొద్దుగూకితే.. మళ్లీ తెలవారడానికి నాలుగు నెలలు పడుతుంది. నమ్మశక్యంగా లేకున్నా.. అదే నిజం. మనం మాట్లాడుకుంటున్నది అంటార్కిటికా ఖండం గురించి. ఈ మంచు ఖండంలో శీతాకాలం అంతా సూర్యుడి ముఖమైనా చూపెట్టడు. దక్షిణ ధ్రువం చుట్టూ ఉండే ఈ ఖండం నాలుగు నెలల శీతాకాలం మొత్తం చీకటిలోనే ఉంటుంది. నాసా ప్రకారం, దీనికి కారణం ఇలా ఉన్నది. మన సౌర కుటుంబంలోని ఒక గ్రహమైన భూమి..తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందనే విషయం తెలిసిందే. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. భూమి కచ్చితమైన గోళం ఆకారం ఉండదు. పైన కింద కొంత నొక్కినట్టుగా ఉంటుంది. ఈ భూగ్రహం ఒక వైపు వంగి పరిభ్రమిస్తుంటుంది. ఇలా ఒక వైపు వంగి భ్రమించడం వల్లే భూమిపై రుతువులు ఏర్పడతాయి. ఇలా వంగి భ్రమించేటప్పుడు దక్షిణ ధ్రువ భాగం సూర్యుడివైపు ఉన్నప్పుడు అంటార్కిటికా ఖండం స్థిరంగా సూర్యుడికి ఎక్స్‌పోజ్ అయ్యే ఉంటుంది. కాగా, ఆ దక్షిణ ధ్రువం సూర్యుడికి దూరంగా ఉన్నప్పుడే సూర్యుడి కిరణాలు అంటార్కిటికా ఖండాన్ని చేరవు. అదే శీతాకాలం. ఈ నాలుగు నెలల శీతాకాలంలోనే అంటార్కిటికా ఖండంలో సూర్యుడు ఉదయంచడు.

వ్యోమగాములకు శిక్షణ
వ్యోమగాములకు ఎక్కడ శిక్షిణ ఇస్తారనే విషయం ఎప్పుడైనా ఆలోచించారా? భూమికి దూరంగా ఎప్పుడూ చీకటిగా ఉండే అంతరిక్షంలోని కఠినమైన పరిస్థితులను తట్టుకోవడానికి వ్యోమగాములకు అంటార్కిటికా ఖండంలో శిక్షణ ఇస్తారని మీకు తెలుసా? భూమిపై కఠిన వాతావరణ పరిస్థితులు ఈ నాలుగు నెలలు అంటార్కిటికాలోనే ఉంటాయి. అందుకే శాస్త్రజ్ఞులు దీర్ఘకాలం అంతరిక్ష ప్రయోగాలకు, పరిశోధనలకు పంపేవారిని ఈ నాలుగు నెలలు అంటార్కిటికాకు పంపిస్తారు. వారిని అంటార్కిటికాలోని కంకార్డియా స్టేషన్‌లో శిక్షణ ఇస్తారు. కొన్ని నెలలపాటు బయటి ప్రపంచానికి దూరంగా ఈ స్టేషన్‌లోని మూడు బ్లాక్‌లలోనే జీవించి ప్రయోగాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కఠిన శీతోష్ణస్థితుల్లో మానవ దేహం ఎలా ప్రవర్తిస్తుంది? దాన్ని ఎలా నియంత్రణలో ఉంచుకోవాలనే విషయాలపైనా అవగాహన కల్పిస్తారు.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఈ కంకార్డియా స్టేషన్‌ను నిర్వహిస్తుంది. ఈ స్టేషన్‌ను నిర్మించిన.. ఆపరేట్ చేసేవి ఫ్రెంచ్ పోలార్ ఇన్‌స్టిట్యూట్, ఇటాలియన్ అంటార్కిటిక్ ప్రోగ్రామ్‌లు. ఈ స్టేషన్‌లో మూడు బిల్డింగ్‌లు ఉంటాయి. రెండు బిల్డింగ్‌లు లివింగ్, వర్కింగ్ క్వార్టర్లుగా ఉన్నాయి. కాగా, మరొకదాంట్లో టెక్నికల్ ఎక్విప్‌మెంట్లు ఉంటాయి.

ఈ సారి ఈ స్టేషన్‌లో 13 మంది క్రూలు శిక్షణ పొందుతారు. ఫ్రెంచ్, ఇటాలియన్ రీసెర్చర్లు, టెక్నీషియన్లు సహా స్వీడన్ పర్యవేక్షకుడు డాక్టర్ హాన్స్ హాగ్సన్ ఉండనున్నారు. 

ఈ ఏడాది మే 13వ తేదీనే ఇక్కడ శీతాకాలం ప్రవేశించింది. అంటే సూర్యుడు చివరిగా అస్తమించాడు. మళ్లీ నాలుగు నెలల తర్వాతే ఈ మంచు ఖండంలో ఉదయిస్తాడు. ఈ కాలంలో సూర్యుడిలేని కారణంగా ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోనున్నాయి. -80 డిగ్రీల సెల్సియస్‌లకు పడిపోనున్నాయి. ఈ ఖండానికి చివరిగా ఫిబ్రవరిలోనే లాస్ట్ విమానం వచ్చి వెళ్లింది. మళ్లీ శీతాకాలం ముగిసే వరకు బయటి నుంచి ఎవరు రారు. హై అల్టిట్యూడ్ కారణంగా మనిషి దేహంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. క్రానిక్ హైపోబారిక్ హైపోక్సియా లేదా బ్రెయిన్‌లో ఆక్సిజన్ కొరత వంటి సమస్య ఏర్పడే ముప్పు ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios