Revanth Reddy vs Jagan: తెలంగాణ సీఎం వర్సెస్ ఏపీ సీఎం .. వీరిలో ఎవరు ధనవంతులో తెలుసా?
CM Revanth Reddy vs AP CM Jagan: ఎన్నికల వేళ చాలామందిలో ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏ నాయకుడు గెలుస్తాడనేది పక్కన పెడితే.. ఏ రాజకీయ నాయకుడికి ఆస్తి ఎంత, ఎన్ని అప్పులున్నాయని తెలుసుకోవాలని చూస్తుంటారు. ఇక ముఖ్యంగా ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు ఏ లీడర్ అఫిడవిట్ లో ఎంత ఆస్తుల వివరాలను బహిర్గతం చేశారు అన్న విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. అలాగే ఏ నాయకుడి ఆస్తి ఇతరుల కన్నా ఎక్కువ ఉంది అని పోల్చుకుంటూ ఉంటారు. అలాగే ఇప్పుడు మనం ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తివివరాలను, అటు ఏపీ సీఎం ఆస్తివివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
దేశమంతా ఎన్నికల పండగ మొదలైంది. ఇటు ఆంధ్రప్రేదేశ్ లో కూడా ఎన్నికల సందడి మొదలైంది. నాయకుల ప్రచారాలతో ఆంధ్ర రాష్ట్రమంతా అట్టుడికి పోతుంది. అలాగే పార్టీల అధిపతుల నామినేషన్లు.. అందులో వారు చూపిన ఆస్తులు హాట్ టాపిక్ గా మారాయి. అలాగే ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల లెక్కలు కూడా ఎన్నికల సమయంలో బహిర్గతం అయ్యాయి.
Revanth Reddy vs Jagan
Revanth Reddy vs Jagan ఏపీలో సీఎం జగన్, తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల నామినేషన్ కోసం సమర్పించిన అఫిడవిట్ లో పొందుపరిచిన తమ సొంత ఆస్తులు.. తమ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాల ప్రకారం ఎవరు ముందున్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాల్లోకెళితే ఆయన నికర ఆస్తుల విలువ రూ.30 కోట్లు ఉంది. రేవంత్ రెడ్డి అఫిడవిట్ లో తెలిపిన దాని ప్రకారం ఆయన వద్ద సుమారు రూ.5,34,000 నగదు, ఆయన భార్య గీతా రెడ్డి ఆస్తులతో కలుపుకుని స్థిర చర ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.30,95,52625 గా ఉందని ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Reavnth reddy
అలాగే సీఎం రేవంత్ రెడ్డి భార్య వద్ద వజ్రాల ఆభరణాలు, 1235 గ్రాముల బంగారం, 9700 గ్రాముల వెండి వస్తువులు ఉన్నాయని తెలిపారు. అలాగే సీఎం వద్ద ఒక మెర్సిడెస్ బెంజ్, ఒక హోండా సిటీ వాహనాలు కూడా ఉన్నాయని తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి వద్ద సుమారుగా రూ.2,50,000 విలువ చేసే ఓ రైఫిల్, పిస్టల్ ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇక అప్పుల విషయానికొస్తే సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి పేర్ల మీద సుమారుగా 1,30,19,901 మేర అప్పులు ఉన్నాయని తెలిపారు.
YS Jagan
ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనలో వేల కోట్లు దోచేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కానీ ఆయన దాఖాలు చేసిన ఆఫిడవిట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఆయన ఆస్తుల వివరాలు చూస్తే మాత్రం నోరెళ్లబెట్టడం ఖాయం.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ ఆస్తుల వివరాల్లోకెళితే 779.8 కోట్లగా తెలిపారు. అలాగే జగన్ పేరుతో 529. 87 కోట్ల ఆస్తులు ఉండగా, ఆయన భార్య భారతి పేరు మీద రూ.176. 30కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఇక ఆయన సీఎం అయ్యాక ఈ ఐదేళ్ళలో 41 శాతం జగన్ ఆస్తుల విలువ పెరిగింది. అలాగే 26 కోర్టు కేసులు ఎదుర్కొంటున్నట్టు తెలిపారు.