కరోలినా:  తన ప్రైవేట్ విమానంలో మైనర్ బాలికతో శృంగారంలో మునిగి తేలిన అమెరికాకు చెందిన ఓ మిలినీయర్‌ను  పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ కేసులో నిందితుడికి ఐదేళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అమెరికాలోని  ఓ మిలినీయర్‌ స్టీఫెన్ బ్రాడ్లీ పెద్ద వ్యాపారవేత్త.  విమానాన్ని ఆటో పైలెట్‌ మోడ్‌లో ఉంచి 15 ఏళ్ల మైనర్ బాలికతో ఈ వ్యాపారవేత్త  శృంగారంలో పాల్గొన్నాడు. 

బాధితురాలి తల్లి న్యూజెర్సీలోని తనకు తెలిసిన ఓ వ్యాపారవేత్తతో తన కూతురికి ఫ్లైయింగ్ పాఠాలు నేర్పాలని కలిసింది. ఈ విషయం తెలిసిన స్టీఫెన్‌ను చేరడంతో దాన్ని ఆసరాగా తీసుకొని ఆ బాలికకు ఫ్లైట్ నేర్పిస్తానని హామీ ఇచ్చాడు. 

2017 నుండి మైనర్ బాలికతో స్టీఫెన్ స్నాప్ చాట్ ద్వారా శృంగార సందేశాలు పంపుతూ వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను అడిగేవాడు. నిందితుడికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు.

ఈ బాలికను పలుమార్లు న్యూజెర్సీలోని ధనికులు ఎక్కువగా నివాసం ఉండే తన గెస్ట్‌హౌజ్‌కు కూడ తీసుకెళ్లేవాడని తేలింది. పలు ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్లు ఉన్న స్టీఫెన్  ఎయిర్ లైఫ్‌లైన్ స్వచ్చంధసంస్తను నడుపుతున్నాడు. 

2017 జూలై 20న స్కూల్ బాలికతో తన ప్రైవేట్ జెట్‌లో సోమర్ సెట్ విమానాశ్రయం నుండి మసాచుసెట్స్‌లో గల బ్రాంస్టేబుల్ వరకు ప్రయాణించాడు. తిరుగు ప్రయాణంలో విమానాన్ని ఆటో పైలెట్ మోడ్‌లో ఉంచి ఆ బాలికతో ఆయన శృంగారంలో మునిగాడు. ఈ విషయమై స్టీఫెన్‌‌పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు విచారణలో ఉంది. నిందితుడికి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.