తల్లి సెక్స్ పిచ్చి.. కూతురి ప్రాణాలు తీశాయి. మూడేళ్ల కూతుర్ని ఓ తల్లి తన సెక్స్ పచ్చి అతి దారుణంగా చంపేసింది. ఈ దారుణ సంఘటన మిసిసిప్పీలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే..ఈ సంఘటన 2016లో  చోటుచేసుకుంది. మిసిసిప్పీకి చెందిన క్యాసీ బార్కర్.. పోలీసులు ఉన్నతాధికారిగా విధులు నిర్వహిస్తోంది. ఆమెకు తన సుపీరియర్ తో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో ఒక రోజు రాత్రి.. తన మూడేళ్ల కుమార్తెతో కలిసి తన సూపరియర్ ఇంటికి వచ్చింది.

సుపీరియర్ ఇంటికి వద్దకు రాగానే.. తన మూడేళ్ల కుమార్తెను కారులో ముందు సీటులో కూర్చోబెట్టి.. కనీసం ఏసీ కూడా ఆన్ చేయకుండా ఆమె ఇంట్లోకి వెళ్లిపోయింది. దాదాపు నాలుగు గంటల పాటు ఆమె పడక సుఖం అనుభవించి తర్వాత బయటకు వచ్చింది. అయితే.. అప్పటికే కారులో ఊపిరాడక.. వేడి తట్టుకోలేక చిన్నారి కన్నుమూసింది.

ఆ చిన్నారి శరీరం 107 డిగ్రీల వేడితో ఉండటం గమనార్హం. కాగా.. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా క్యాసీ బార్కర్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను వెంటనే విధుల్లో నుంచి కూడా తొలగించేశారు. కావాలనే కూతుర్ని కారులో వదిలేసి వెళ్లిందా.. పొరపాటున మర్చిపోయిందో తమకు తెలియదని పోలీసులు చెప్పారు.

కాగా.. ఆ తల్లికి ఇప్పుడు న్యాయస్థానం 20 సంవత్సరాలపాటు శిక్ష విధించే అవకాశం ఉంది. కోర్టులో కేసు నడుస్తోంది.