Asianet News TeluguAsianet News Telugu

నాన్ వెజ్ తినే వాళ్ల‌తో సెక్స్ చేయొద్దు : మ‌హిళ‌ల‌కు పిలుపునిచ్చిన పెటా.. సెటైర్లు వేసిన నెటిజన్లు

నాన్ వెజ్ తినే పురుషులతో మహిళలు సెక్స్ లో పాల్గొనవద్దని పెటా ఇచ్చిన పిలుపు విమర్శల పాలవుతోంది. నెటిజన్లు ఆ పిలుపును వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

Dont have sex with non-veg eaters: PETA called on women.. Netizens made satires
Author
First Published Sep 28, 2022, 9:19 AM IST

గ్లోబల్ యానిమల్ రైట్స్ గ్రూప్ పెటా (పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్) వాతావరణ మార్పులను పరిష్కరించడానికి ఒక కొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. మాంసం తినే పురుషులతో సెక్స్ చేయొద్దని మహిళలకు పిలుపునిచ్చింది. కానీ నెటిజన్లు ఆ పిలుపున‌కు భిన్నంగా స్పందించారు. పెటా ప్ర‌చారంతో ఏకీభ‌వించ‌లేదు. 

పెటా సెప్టెంబ‌ర్ 22వ తేదీ నాటి బ్లాగ్ లో ఇలా పేర్కొంది. ‘‘ పురుషులు చేతిలో బీరు సీసాలు పట్టుకొని,  ఖరీదైన గ్యాస్ గ్రిల్స్‌పై సాసేజ్‌లు వండుతారు. ఈ బార్బెక్యూ మాస్టర్లు తమ మగతనాన్ని తాము నిరూపించుకోగలరని నమ్ముతారు. ఇలా మాంసాహారం తీసుకుంటూ జంతువులను హింసించ‌డంతో పాటు ఈ భూ గ్రహానికి కూడా హాని క‌లిగిస్తారు’’ అని పేర్కొంది.

వాతావరణ విపత్తుకు స్త్రీల కంటే పురుషులే ఎక్కువ‌గా కార‌ణం అవుతార‌ని ప్లోస్ వన్ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనాన్ని పెటా ఉద‌హ‌రించింది. మాంసం తినే పురుషులు గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారానికి 41 శాతం ఎక్కువ‌గా కార‌ణం అవుతున్నార‌ని పెటా పేర్కొంది.‘‘ అందుకే శాకాహారిగా మారడానికి వారిని ఒప్పించేందుకు మాంసం తినే పురుషులతో సెక్స్‌పై సమ్మెను పెటా ప్రతిపాదిస్తోంది’’ అని తెలిపింది.

అయితే ఈ పోస్ట్ పై సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేశారు. పెటా ప్ర‌చారాన్ని వ్య‌తిరేకించారు. పెటా ప్ర‌చారంలో శాస్త్రీయ‌త లేద‌ని తెలిపారు. ఆ పోస్ట్ ను వ్య‌తిరేకిస్తూ సెటైరిక‌ల్ సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 

‘‘ మాంసాహారం తినే పురుషులతో సెక్స్‌లో పాల్గొనడం మానేయాలని PETA మహిళలను కోరింది. సెక్స్ సమ్మెకు పిలుపునిస్తూ PETA ఇలా పేర్కొంది. పురుషులు వారి చర్యలకు జవాబుదారీతనం వహించాలి. PETA వారు శాకాహారిగా ఉండమని ఒప్పించేందుకు మాంసం తినే పురుషులతో సెక్స్‌పై సమ్మెను ప్రతిపాదిస్తోంది.’’ అయితే మరి మాంసాహారం తినే మహిళల సంగతేంటి’’ అని ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. 

‘‘ నేను, ప్రధానంగా మాంసాహారం తినే మహిళ, తద్వారా పెటా మూర్ఖపు ఫిర్యాదుల నుండి విముక్తి పొందాను.’’ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios