రానురాను మానవత్వం మంట కలసిపోతోంది. మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. తోటి మనిషిని మనిషిగా గుర్తించకపోగా వారిపై దారుణాలకు ఒడిగట్టడానికీ వెనుకాడటం లేదు. ఘోర కృత్యాలకు పాల్పడ్డంలో మనుషులనే కాదు... శవాలనూ వదలడం లేదు. లండన్ లో జరిగిన ఓ సంఘటన అందరినీ విస్మయానికి గురిచేసింది.

అంత్యక్రియలు నిర్వహించే హోమ్ లో ఉన్న మహిళా శవంతో ఓ 23ఏళ్ల యువకుడు  సెక్స్ చేశాడు. పీకలదాకా మద్యం సేవించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా.. దానిని గమనించిన అక్కడి సిబ్బంది ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై కేసు నమోదైంది.

ఈ కేసుకి సంబంధించి శుక్రవారం కోర్టుకు హియరింగ్ కి రాగా.. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయస్థానం అతనికి శిక్ష విధించింది. మానవత్వం మరిచి.. అతి దారుణంగా ప్రవర్తించిన యువకుడికి అక్కడి న్యాయస్థానం 6 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.