ప్రస్తుతం చాలామంది మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారు. మలబద్ధకం వల్ల ఉదయన్నే బాత్రూంకి వెళ్లలేక.. రోజంతా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అయితే ఈ సింపుల్ చిట్కాలతో మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదేలాగో ఇక్కడ చూద్దాం. 

గజిబిజి లైఫ్ స్టైల్, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. వాటిలో మలబద్ధకం ఒకటి. ఈ మధ్య కాలంలో చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. సాధారణంగా చాలామంది ఉదయాన్నే బాత్రూంకి వెళ్తారు. దానివల్ల పొట్ట ఫ్రీ అయిపోతుంది. కానీ మలబద్ధకం సమస్య ఉంటే కడుపు ఉబ్బినట్టు అనిపిస్తుంది. రోజంతా చాలా ఇబ్బందిగా ఉంటుంది. చాలాసార్లు బాత్రూంకి వెళ్లడానికి ప్రయత్నించడం వల్ల నీరసం కూడా వస్తుంది. మరి ఈ సమస్యకు ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.

మలబద్ధకం సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు

మెంతులు

మలబద్ధకం సమస్యకి మెంతులు చాలా మంచివి. మెంతుల్లో ఉండే గుణాలు కడుపుని శుభ్రం చేసి మలబద్ధకాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మెంతులు తింటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మెంతుల్లో అనెథోల్ అనే పదార్థం ఉంటుంది. ఇది కడుపులో మంట, బాక్టీరియా, వైరస్‌లని తగ్గిస్తుంది. వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం తగ్గుతుంది.

అంతేకాదు మెంతులు తినడం వల్ల నిద్ర మంచిగా పడుతుంది. మెంతుల్లో మెగ్నీషియం ఉంటుంది. ఇది కండరాలని సడలిస్తుంది. మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. మెంతులు తింటే ఒత్తిడి తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు నీటిలో 1-2 చెంచాల మెంతులు వేసి నానబెట్టండి. ఉదయం లేవగానే ఆ నీటిని తాగేయండి. మెంతుల్ని నమిలి తినేయండి.

సోంపు

మలబద్ధకం సమస్య ఉన్నవాళ్లు రాత్రి భోజనం తర్వాత ఒక చెంచా సోంపు తినాలి. సోంపు తింటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి. భోజనం తర్వాత కడుపు హాయిగా ఉంటే నిద్ర బాగా పడుతుంది. ఉదయం ఫ్రెష్‌గా ఉంటారు.

రాత్రిపూట ఒక చెంచా సోంపు తింటే కడుపు శుభ్రంగా అవుతుంది. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలవిసర్జన సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. సోంపు తింటే ఆహారం సులువుగా జీర్ణమవుతుంది. పొద్దున్నే బాత్రూంకి వెళ్లాలనిపిస్తుంది.

నోటి దుర్వాసన తగ్గుతుంది

సోంపు తింటే జీర్ణక్రియ మెరుగుపడడమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది. సోంపు నోటి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు నోట్లో ఉండే చెడు బాక్టీరియాను చంపేస్తాయి. సోంపు మౌత్ ఫ్రెషనర్ లా కూడా పనిచేస్తుంది.

గమనిక:

ఈ చిట్కాలు సాధారణ సమాచారం కోసం మాత్రమే. మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు లేదా ఏదైనా వ్యాధికి సంబంధించిన చికిత్స తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.